500 Wickets In Test Cricket :క్రికెట్లోనిఏ ఫార్మట్‌లోనైనా సరే వంద వికెట్లు తీయడం అంటే అది ఓ రికార్డు కింద లెక్కే. దీన్ని ఆ బౌలర్ అంతర్జాతీయ కెరీర్లో ఓ ప్రత్యేక మైల్‌స్టోన్‌గా చెప్పొచ్చు. ఓవర్ల సంఖ్యను బట్టి చూస్తే టెస్టుల్లో ఈ ఫీట్ సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. తాజాగా అస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ ఇప్పటి వరకు తన కెరీర్లో మొత్తం 500 వికెట్లు తీసిన రికార్డుకెక్కాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే 800 వికెట్లు తీసి ఈ లిస్టులో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈయనలాగే మరికొంత మంది ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు ఉన్నారు. ఇంతకీ వారెవరంటే ?
1. ముత్తయ్య మురళీధరన్ (800)
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన లిస్ట్‌లో శ్రీలంక మాజీ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ టాప్‌లో ఉన్నారు. ఈయన తన కెరీర్లో మొత్తం 800 వికెట్లు తీశాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన శ్రీలంక స్పిన్ మాంత్రికుడు తన కెరీర్లో ఐదేసి వికెట్లు చొప్పున 67 సార్లు, పది వికెట్లు చొప్పున 22 సార్లు వికెట్లు పడగొట్టి తన టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
2. షేర్ వార్న్(708)
ప్రపంచ గొప్ప స్పిన్నర్లలో ఒకరైన దిగ్గజ క్రికెటర్ షేర్ వార్న్. అత్యధిక వికెట్ల క్లబ్లో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన తన కెరీర్లో 708 వికెట్లు పడగొట్టి రికార్డుకెక్కాడు. 108 టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన వార్న్. 145 మ్యాచుల్లో 708 వికెట్లు తీశాడు. షేర్ వార్న్ బంతులను ఎదుర్కొవడమంటే బ్యాటర్లకు పీడ కలగా భావిస్తుండేవారు.
3. జేమ్స్ అండర్సన్ (690)
2003లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన జేమ్స్ అండర్సన్ రెడ్ బాల్ ఫార్మాట్లో మొత్తం 690 వికెట్లు పడగొట్టాడు. ఇతని స్పీడ్‌ను చూసిన అభిమానులు త్వరలో ఈ స్టార్ ప్లేయర్ 700 వికెట్ల మైలురాయిని చేరుకోవచ్చు. ప్రస్తుతానికి 183 మ్యాచులతో 690 వికెట్లతో టాప్ త్రీ బౌలర్‌గా కొనసాగుతున్నాడు అండర్సన్. 41 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఐదు వికెట్లు చొప్పున 32 సార్లు పది వికెట్ల చొప్పున మూడు సార్లు వికెట్లు పడగొట్టాడు.