వన్డే, టీ20 ఫార్మాట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టు క్రికెట్ మరుగున పడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆదరించే అభిమానుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెబుతున్నారు. అయితే.. ఈ ఫార్మాట్‌ను సజీవంగా ఉంచేందుకు చాలా మార్పులు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. టెస్టు క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు ఓ ఐదు మార్పులు తీసుకురావాలని కొందరు చెబుతున్నారు. ఆ ఐదు మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఫ్రీ హిట్
పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో.. బౌలర్ నో బాల్ వేసినప్పుడు 'ఫ్రీ హిట్'(Free hit Rules) అవకాశం ఉంటుంది. అంటే బౌలర్ ఎక్స్ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ బంతిని బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్నప్పుడు కేవలం రనౌట్ అయితేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మిగతా విధానాల్లో ఔటయితే దాన్ని ఔట్‌గా నిర్ధరించరు.
కానీ, సుదీర్ఘ ఫార్మాట్లో ఇలా కాదు. బౌలర్ చేసిన తప్పిదానికి బ్యాట్స్‌మన్ ఇబ్బందుల్లో పడే సందర్భాలు ఎదురవుతాయి. ఒకవేళ బౌలర్ నోబాల్ వేస్తే.. ఆ బంతిని లెక్కలోకి పరిగణించకుండా ఎక్స్ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్స్ట్రా బంతికి ఔట్ అయినా బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు చేరాల్సిందే.
2. లెగ్ సైడ్ వైడ్లు
టెస్టులతో పోల్చితే.. వన్డే, టీ 20ల్లో లెగ్ సైడ్ వైడ్ల పరిమితులు భిన్నంగా ఉంటాయి. టెస్టుల్లో బంతిని వైడ్‌గా పరిగణించడం చాలా అరుదుగా చూస్తుంటాం. అదే వన్డే, టీ20ల్లో అయితే.. బంతి కాస్త లెగ్ సైడ్ దిశగా వెళితే చాలు దాన్ని వైడ్‌గానే పరిగణిస్తారు.
ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో.. షార్ట్ పిచ్ బంతులు, బౌన్సర్లు వేసి బ్యాట్స్‌మన్‌ను టార్గెట్ చేస్తుంటారు బౌలర్లు. లెగ్‌సైడ్ వైడ్ నిబంధనలను టెస్టుల్లో పెడితే బౌలర్లకు ఈ అవకాశం ఉండదు.
3. రిజర్వ్ డే