తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో ఈ గణాంకాలకూ ఓ కిక్కుంది! - ENGLAND VS AUSTRALIA

క్రికెట్​లో సిక్సుల మోత.. ఫోర్ల ధమాకా చూసుంటారు. అయితే ఈ ఆటలో ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటితో టీమ్​ఇండియా క్రికెటర్లకు ఉన్న సంబంధమేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

5 more interesting facts in cricket
క్రికెట్ న్యూస్

By

Published : May 24, 2021, 5:30 PM IST

క్రికెట్.. ఎందరికో అభిమాన క్రీడ. ఇందులో ఎంతోమంది క్రికెటర్లు ఎన్నో అరుదైన ఘనతల్ని సాధించారు. లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పారు. అయితే ఇందులో ఆశ్చర్యపరిచే సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం.

183 కొడితే టీమ్ఇండియా కెప్టెన్సీ పక్కా!

భారత క్రికెట్​లో '183'కు ఓ ప్రత్యేకత ఉంది. అత్యుత్తమ బ్యాట్స్​మన్ అయిన ధోనీ, గంగూలీ, కోహ్లీల అత్యధిక స్కోరు ఇదే. అయితే దీని వెనుక ఓ ఆసక్తికర విశేషముంది. ఈ ముగ్గురు క్రికెటర్లు.. ఆ నంబర్​ను అందుకున్న తర్వాతే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్లు అయ్యారు. ఎన్నో చిరస్మరణీయ ఘనతల్ని సాధించారు.

.

>> 1999 ప్రపంచకప్​లో సౌరభ్ గంగూలీ శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాదే భారత జట్టులో ఫిక్సింగ్​ కుంభకోణం జరిగిన నేపథ్యంలో కెప్టెన్​గా అవతరించాడు.

>> 2005లో శ్రీలంకతో మ్యాచ్​లో ధోనీ ఈ మార్క్​ను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో మూడోస్థానంలో బరిలోకి దిగి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20 ప్రపంచకప్(2007)​ సమయంలో సీనియర్ల గైర్హాజరీతో కెప్టెన్సీ దక్కించుకున్నాడు.​

>> 2012 ఆసియాకప్​లో పాకిస్థాన్​తో మ్యాచ్​లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 183 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆ తర్వాత ఏడాదే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సారథి హోదాను అందుకున్నాడు. 2017లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా మారాడు.

మూడు డబుల్ సెంచరీలు.. విశేషం ఒక్కటే

అంతర్జాతీయ క్రికెట్​లోని పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో 200 పరుగులు చేయడమనేది 2010 వరకు అందనంత ఎత్తులో ఉండేది. చాలా మంది బ్యాట్స్​మెన్ ఈ ఘనతకు దగ్గర వరకు వచ్చినా, దీనిని అందుకోలేకపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లలో వరుసగా నాలుగు ద్విశతకాలు నమోదయ్యాయి. అవన్నీ భారత క్రికెటర్లే చేయడం విశేషం.

.

2010లో దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్ తొలిసారి ఈ మార్క్​ అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. అక్కడి నుంచి సరిగ్గా 18 నెలల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ దీనిని బ్రేక్​ చేశాడు. వెస్టిండీస్​పై 219 పరుగులు చేశాడు.

అనంతరం 2013లో రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాపై, తన కెరీర్​లో తొలి 'డబుల్' (209) చేశాడు. ఆ తర్వాతి ఏడాదే రికార్డు సృష్టిస్తూ, మరో ద్విశతకం(264) చేసి ఔరా అనిపించాడు. ఈడెన్​ గార్డెన్స్​లో శ్రీలంకపై ఈ ఘనత సాధించాడు.

ఈ ముగ్గురూ 'డబుల్' చేసిన అన్ని మ్యాచ్​ల్లోనూ యాధృచ్ఛికంగా టీమ్ఇండియాకు ఒకేలాంటి అంశముంది. ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ ప్రత్యర్థిపై సరిగ్గా 153 పరుగుల తేడాతో విజయం సాధించడం.

ఒకేరోజు నాలుగు ఇన్నింగ్స్​లు

2011 నవంబరులో జరిగిన ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా తొలి టెస్టులో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. పలు రికార్డులు బద్దలయ్యాయి. సాధారణంగా టెస్టుల్లో మనం ఒకేరోజు రెండు ఇన్నింగ్స్​లు ఆడటం చూస్తుంటాం. కానీ ఈ మ్యాచ్​లో మాత్రం ఏకంగా నాలుగు ఇన్నింగ్స్​లు ఆడారు.

.

214/8తో రెండోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. లంచ్​కు ముందు 284 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తర్వాత వచ్చిన సఫారీలు 96 పరుగులకే చాపచుట్టేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన కంగారూలు.. మరీ దారుణంగా 47 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. మళ్లీ బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా ఆ రోజు ముగిసేసరికి 81/1తో నిలిచింది. ఒకేరోజు 23 వికెట్లు పడిన ఈ సంఘటన క్రికెట్​ రికార్డుల్లోకి ఎక్కింది.

ఆ తర్వాత రోజు మరో ఆశ్చర్యపరిచే అంశం జరిగింది. సఫారీ బ్యాట్స్​మెన్ నెల్సన్ 111* పరుగులతో క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా విజయానికి సరిగ్గా 111 పరుగులే కావాలి. అప్పుడు సమయం 11 గంటల 11 నిమిషాలు. ఆ రోజు తేదీ 11-11-2011. ఈ సంఘటకు జరిగినప్పుడు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్​ను దక్షిణాఫ్రికా అడగ్గా.. వారందరూ ఒంటికాలిపై నిలబడ్డారు.

క్లార్క్+కుక్= సచిన్

క్రికెట్​లో ఉత్తమ క్రికెటర్లలో దిగ్గజ సచిన్ తెందూల్కర్ ముందువరుసలో ఉంటాడు. అంతర్జాతీయ కెరీర్​లో లెక్కలేనన్ని పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. వన్డేల్లో 18, 426 పరుగులు, టెస్టుల్లో 15, 921 రన్స్ చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అత్యధిక శతకాల సంఖ్య ఇతడిదే.

.

తన కెరీర్​లో 200వ టెస్టు ఆడి, 2013 నవంబరులో రిటైర్మెంట్ తీసుకున్నాడు సచిన్. అయితే తర్వాతి నెలలో ఓ యాధృచ్ఛిక సంఘటన జరిగింది. మైకేల్ క్లార్క్(ఆసీస్), అలిస్టర్ కుక్(ఇంగ్లాండ్).. తమ జట్ల తరఫున అప్పుడే 100వ టెస్టు ఆడారు.

ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​ పూర్తయిన తర్వాత కుక్.. టెస్టుల్లో 7,955 పరుగులతో నిలిచాడు. ఇందులో 25 శతకాలు ఉన్నాయి. అదే సమయంలో క్లార్క్.. 7,964 టెస్టు పరుగులతో ఉన్నాడు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. వీరిద్దరి స్కోర్లు కలిపితే 15,919 పరుగులు, 51 శతకాలు అవుతాయి. రిటైర్​ అయ్యే సమయానికి సచిన్ కూడా టెస్టుల్లో దాదాపు ఇదే గణాంకాలతో నిలిచాడు. అందుకే క్లార్క్+కుక్= సచిన్ తెందూల్కర్.

​వందేళ్ల తర్వాతైనా ఫలితం మారలేదు

టెస్టు చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​లు అతి పురాతన జట్లు. ఈ రెండింటి మధ్య 1877లో మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్​లో తొలి మ్యాచ్​ జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత అదే మైదానంలో టెస్టు జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఒకే ఫలితం నమోదు కావడం విశేషం.

.

అప్పటి మ్యాచ్​లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 245 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 196 పరుగులకు ఆలౌట్​ అయింది. 49 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 104 పరుగులకు ఆలౌటైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టును 108 పరుగులకే ఆలౌట్ చేసింది కంగారూ జట్టు.

వందేళ్ల తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరిగిన టెస్టులోనూ ఇదే ఫలితం నమోదైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 138 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 95కు ఆలౌట్ అయింది. అనంతరం 419/9 వద్ద ఆసీస్ రెండో ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. 463 పరుగుల లక్ష్యంతో బరిలో నిలిచిన ఇంగ్లీష్ జట్టు.. 417 పరుగులకు చాపచుట్టేసింది. దీంతో రెండుసార్లు 45 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details