తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన అమ్మాయిలు- రెండో టీ20 ఇండియాదే - team india

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన హర్మన్​ సేన.. సిరీస్​ను సమం చేసింది. నిర్ణయాత్మక చివరి మ్యాచ్​ బుధవారం జరగనుంది.

India Women won by 8 runs
భారత మహిళల జట్టు

By

Published : Jul 11, 2021, 10:42 PM IST

Updated : Jul 11, 2021, 11:01 PM IST

ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్​పై విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్​ను సమం చేసింది. నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది.

తొలుత బ్యాటింగ్​లో షెఫాలీ వర్మ(38 బంతుల్లో 48), సారథి హర్మన్​ ప్రీత్​ కౌర్​( 25 బంతుల్లో 31) చెలరేగారు. స్మృతి మంధాన(20), దీప్తి శర్మ(24) సైతం రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది టీమ్​ ఇండియా. ఇంగ్లాండ్ బౌలర్లలో సివర్​, విలియర్స్​ కట్టుదిట్టంగా బంతులేశారు.

ఫీల్డింగ్​ అదరహో..

అనంతరం బ్యాటింగ్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్​ బ్యూమాంట్​ 59, కెప్టెన్​ హెథర్​ నైట్ 30 పరుగులు చేసి భారత్​ను భయపెట్టారు. మూడో వికెట్​కు 75 పరుగులు జోడించారు. విజయం దిశగా సాగుతున్న తరుణంలో.. భారత మహిళల అద్భుత ఫీల్డింగ్​తో ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​ పేకమేడలా కూలిపోయింది. ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు రనౌటవ్వడం గమనార్హం. చాలా మంది సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా స్నేహ్​ రాణా.. చక్కని బంతులేసి కట్టడి చేసింది. ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. దీంతో విజయం భారత్​ సొంతమైంది.

పూనమ్​ యాదవ్​ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. అరుంధతీ రెడ్డి, దీప్తి శర్మ తలో వికెట్​ తీశారు. ప్రస్తుతం 3 టీ20ల సిరీస్​లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరి మ్యాచ్​ బుధవారం జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్​తో 2-1 తేడాతో వన్డే సిరీస్​ ఓడింది టీమ్​ఇండియా.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా-శ్రీలంక తొలి వన్డే జులై 18న

Last Updated : Jul 11, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details