2024 IPL Auction :2024 ఐపీఎల్‌కు సంబంధించి వేలానికి సమయం దగ్గరపడింది. దుబాయ్ వేదికగా బుధవారం (డిసెంబర్ 19) ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధమయ్యాయి. అటు నిర్వాహకులు కూడా వేలంలోకి వచ్చిన ప్లేయర్ల లిస్ట్‌ను ఇదివరకే రిలీజ్ చేశారు. అయితే ఈ వేలానికి సంబంధించి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దామా?
వేలంలో ఉన్న ఆటగాళ్లు : వేలం గురించి అనౌన్స్ చేయగానే దేశీయ ఆటగాళ్లతోపాటు ఫారిన్ ప్లేయర్లు కలిపి 1,166 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపిన 333 ఆటగాళ్లతో ఫైనల్ లిస్ట్ రెడీ చేశారు నిర్వహకులు.
స్లాట్‌లు ఎన్ని? ఎంతమంది ఫారిన్ ప్లేయర్లకు ఛాన్స్ : ఆ వేలంలో మొత్తం 77 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. అందులో 30 ఫారిన్ స్లాట్‌లు ఉన్నాయి. ఇక వేలంలో ఉన్న 333లో 119 మంది ఫారిన్ ప్లేయర్లే.
యంగ్ అండ్ ఓల్డెస్ట్ ప్లేయర్ :17 ఏళ్ల క్వేనా మఫాకా ఈ వేలంలో ఉన్న పిన్న వయస్కుడు. ఇక అఫ్గానిస్థాన్‌కు చెందిన మహమ్మద్ నబీ (38) అత్యధిక వయస్కుడు.
ఎంత వెచ్చించనున్నారు? : పది ఫ్రాంచైజీలు కలిపి ఈ వేలంలో మొత్తం రూ. 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇందులో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.15 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వద్ద రూ. 13.15 కోట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్ వ్యాల్యూ రూ.34 కోట్లు.
వేలం నిర్వహించేది ఎవరు? :ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం నిర్వహించిన మల్లికా సాగర్ ఈ ఐపీఎల్ వేలం కూడా నిర్వహించనున్నారు. ఈమె ముంబయికి చెందిన ఓ ఆర్ట్ కలెకర్టర్. గత కొన్ని ఐపీఎల్ సీజన్లకు హ్యూ ఎడ్మీడ్స్ అక్షనర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మల్లికా ఆ బాధ్యతలు చూడనున్నారు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ నిలవనున్నారు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ ? : టెలివిజన్‌లో అయితే స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్, లైవ్ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా ఓటీటీలో వీక్షించవచ్చు.
ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం- కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్?
2024 ఐపీఎల్ వేలంలో ఫారిన్ ప్లేయర్లు- అందరి కళ్లు వీరిపైనే!