తెలంగాణ

telangana

ETV Bharat / sports

2023 World Cup Warm Up Matches : శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్​లు షురూ.. లైవ్ స్ట్రీమింగ్, పూర్తి వివరాలు ఇవే! - వరల్డ్ కప్​ వార్మప్​ మ్యాచ్​ టీమ్ఇండియా జట్టు

2023 World Cup Warm Up Matches : 2023 వరల్డ్ కప్​ ఆరంభానికి ముందు.. సెప్టెంబర్ 29 శుక్రవారం నుంచి వార్మప్​ మ్యాచ్​లు ప్రారంభంకానున్నాయి. ఈ మ్యాచ్​ల్లో ఎవరు, ఎవరితో తలపడనున్నారంటే?

2023 World Cup Warm Up Matches
2023 World Cup Warm Up Matches

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 1:27 PM IST

Updated : Sep 28, 2023, 1:39 PM IST

2023 World Cup Warm Up Matches :మరో ఏడు రోజుల్లో 2023 ప్రపంచకప్​టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా భారత్​కు చేరుకుంటున్నాయి. అయితే మెగా టోర్నీ స్టార్ట్​ అయ్యేకంటే ముందు అన్ని దేశాలు ఆయా జట్లతో వార్మప్ మ్యాచ్​లు ఆడతాయి. ఈ మ్యాచ్​లు సెప్టెంబర్ 29 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఆ వార్మప్ మ్యాచ్​ల్లో ఏయే దేశాలు ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ తలపడనున్నాయంటే.

  1. మ్యాచ్.1 సెప్టెంబర్ 29.. బంగ్లాదేశ్-శ్రీలంక (బర్సపరా స్టేడియం, గువాహటి )
  2. మ్యాచ్.2 సెప్టెంబర్ 29.. సౌతాఫ్రికా-అఫ్గానిస్థాన్ (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
  3. మ్యాచ్.3 సెప్టెంబర్ 29.. న్యూజిలాండ్-పాకిస్థాన్ (ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్)
  4. మ్యాచ్.4 సెప్టెంబర్ 30.. భారత్-ఇంగ్లాండ్ (బర్సపరా స్టేడియం, గువాహటి )
  5. మ్యాచ్.5 సెప్టెంబర్ 30.. ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
  6. మ్యాచ్.6 అక్టోబర్ 02.. న్యూజిలాండ్-సౌతాఫ్రికా (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
  7. మ్యాచ్.7 అక్టోబర్ 02.. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ (బర్సపరా స్టేడియం, గువాహటి )
  8. మ్యాచ్.8 అక్టోబర్ 03.. అఫ్గానిస్థాన్-శ్రీలంక (బర్సపరా స్టేడియం, గువాహటి )
  9. మ్యాచ్.9 అక్టోబర్ 03.. భారత్-నెదర్లాండ్స్ (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
  10. మ్యాచ్.10 అక్టోబర్ 03.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా (ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్)

మ్యాచ్​లు ప్రారంభమయ్యే సమయం..అన్ని మ్యాచ్​లు 50 ఓవర్ల ఫార్మాట్​లోనే జరుగుతాయి. ఇక మ్యాచ్​లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతాయి.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ..2023 ప్రపంచకప్​ వార్మప్ మ్యాచ్​లన్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ వేదిక డిస్నీ+ హాట్​స్టార్​లో లైవ్​ వీక్షించవచ్చు. ఇక టెలివిజన్​లో స్టార్ స్పోర్ట్స్​ నెట్​వర్క్​ ఛానెల్​లో లైవ్ అందుబాటులో ఉంటుంది. ఇక అక్టోబర్ 5న అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో.. ఈ మెగాటోర్నీ గ్రాండ్​గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్​.. 2019 రన్నరప్ న్యూజిలాండ్​తో తలపడనుంది. 46 రోజులపాటు సాగే ఈ టోర్నీ.. నవంబర్ 19న ముగుస్తుంది. ​

సౌతాఫ్రికా కెప్టెన్ దూరం.. ఈ వార్మప్ మ్యాచ్​లకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా దూరం కానున్నాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడు తిరిగి దక్షిణాఫ్రికా పయనమయ్యాడు. అయితే టోర్నమెంట్​లోని మ్యాచ్​లకు మాత్రం బవూమా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక బవూమా గైర్హాజరీలో.. వార్మప్ మ్యాచ్​ల్లో స్టార్ బ్యాటర్ మర్​క్రమ్ జట్టును నడిపించనున్నాడు. సౌతాఫ్రికా సెప్టెంబర్ 29న అఫ్గానిస్థాన్, అక్టోబర్ 2న న్యూజిలాండ్​తో ఆడాల్సి ఉంది.

World Cup 2023 All Team Squad : గెట్​రెడీ క్రికెట్ ఫ్యాన్స్.. మెగాటోర్నీకి అంతా సెట్​.. 10 దేశాల తుది జట్లు ఇవే!

Teja Nidamanuru Netherlands : నెదర్లాండ్స్​ జట్టులో తెలుగు తేజం.. అతిథిగా వచ్చేస్తున్నాడుగా!

Last Updated : Sep 28, 2023, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details