మరో పది రోజుల్లో న్యూజిలాండ్ వేదికగా ప్రారంభమయ్యే మహిళల ప్రపంచకప్ పోటీల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు సభ్యుల్లో కొవిడ్ కేసులు వస్తే, తొమ్మిది మంది ప్లేయర్స్‌తోనైనా మ్యాచ్‌లను నిర్వహిస్తామని ఐసీసీ వెల్లడించింది.
ఇప్పటికే ఇలాంటి విధానంతో అండర్-19 వరల్డ్‌కప్‌లో కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. యువభారత్ ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలుచుకుంది. ఏదైనా జట్టులోని ఆటగాళ్లకు కొవిడ్ వ్యాప్తి చెందితే మేనేజ్‌మెంట్, కోచింగ్ సిబ్బందిలోని వారిని ఫీల్డింగ్ చేయడానికి అనుమతించేవారమని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ తెలిపారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే తొమ్మిది మంది ప్లేయర్లతో మైదానంలోకి దిగేందుకు జట్లకు అనుమతిస్తాం. అలానే సబ్‌స్టిట్యూట్లలో నాన్-బ్యాటింగ్, నాన్-బౌలర్‌గా ఇద్దరిని ఆడించుకోవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి టీమ్ అదనంగా ఆటగాళ్లను రిజర్వ్‌లో ఉంచుకోవాలని సూచించాం. అలానే 15 మంది సభ్యులు కచ్చితంగా కొవిడ్ నియమాలకు లోబడి ఉండాలి" అని క్రిస్ టెట్లీ వివరించారు.
మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయొచ్చనే వార్తలను ఐసీసీ కొట్టిపడేయలేదు. మార్చి 4 నుంచి ఆతిథ్య దేశం న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మౌంట్ మౌంగనుయ్ వేదికగా తొలి మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. మహిళల టీమ్‌ఇండియా జట్టు మొదటి మ్యాచ్‌లో మార్చి 6న పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇవీ చదవండి: