Asia cup 2022 schedule: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్లు ఆగస్టు 27న ప్రారంభ మ్యాచ్ ఆడనున్నాయి. ఆగస్టు 28న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఇండియా, పాకిస్థాన్ గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ ఏలో మరో క్వాలిఫయర్ టీమ్ చేరుతుంది. ఆసియా కప్ మ్యాచులన్నీ రాత్రి 7.30 గంటలకు జరుగుతాయి. కప్ ఫైనల్ సెప్టెంబర్ 11న జరగనుంది. దీంతో టోర్నీ ముగుస్తుంది.
శ్రీలంకలో జరగాల్సి ఉన్నా..
నిజానికి, ఆసియా కప్ శ్రీలంకలో జరగాల్సి ఉంది. ఆ దేశం ఆర్థికంగా చితికిపోవడం, ఆందోళనలతో అట్టుడికిపోతుండటం వల్ల.. ఆసియా కప్‌ను యూఏఈకి తరలించారు. అయితే, టోర్నీ ఆతిథ్య హక్కులు శ్రీలంక వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తొలి మ్యాచ్‌లో లంక బరిలోకి దిగబోతోంది.