టోక్యో ఒలింపిక్స్ సమీపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం వల్ల క్రీడలను రద్దు చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం (ఐఓసీ) ప్రస్తుతానికైతే క్రీడలను నిర్వహించాలనే పట్టుదలతోనే ఉంది. అయినా సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగుతాయని, భారత్ సన్నద్ధంగా ఉంటే మంచిదని అన్నారు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్ బత్రా.
Tokyo Olympics: మెగా క్రీడలకు సిద్ధంగా ఉండండి - IOA president narinder batra
టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని, భారత్ సన్నద్ధంగా ఉండాలని అన్నారు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్ బత్రా. ఈ మెగాక్రీడలకు వెళ్లే భారత బృందం మొత్తానికి కొవిడ్-19 టీకాలు వేస్తామని తెలిపారు.
ఒలింపిక్స్
"ఐఓసీ నుంచి మాకు వస్తున్న సమాచారం ప్రకారం ఒలింపిక్స్ షెడ్యూలు ప్రకారమే జరుగుతాయి. చాలా స్పష్టంగా ఈ విషయం చెబుతున్నారు. కాబట్టి మనం సిద్ధంగా ఉంటే మంచిది" అని చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళ్లే భారత బృందం మొత్తానికి కొవిడ్-19 టీకాలు వేస్తామని తెలిపారు. భారత అథ్లెట్లు బాగా సన్నద్ధమవుతున్నారని చెప్పారు. "భారత అథ్లెట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఏ అథ్లెట్‌కూ ఇబ్బంది లేదు. అందరూ తాము కోరుకున్న చోట సాధన చేస్తున్నారు" అని అన్నారు.