రిటైర్మెంట్ అనంతరం ఏ క్రికెటరైనా ఏం చేస్తాడు? కోచ్‌గానో, వ్యాఖ్యాతగానో మారతాడు. కానీ, ఆసీస్ మాజీ ఆటగాడు జేవియర్ డోహెర్టీ ఇందుకు భిన్నం. క్రికెట్ తర్వాత కార్పెంటర్‌గా మారాడు. 2015 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైనా జేవియర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నాలుగేళ్లు దాటింది. పొట్టకూటి కోసం ప్రస్తుతం కార్పెంటర్ పని చేస్తున్నాడు.
జేవియర్ పరిస్థితిని తెలుసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్.. సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కానీ, అందుకు డోహెర్టీ ఒప్పుకోలేదు. వారి సాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తాను చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.