Yuvraj Singh Six Sixes : మొదటి బాల్ సిక్స్.. ప్రేక్షకుల్లో ఆనందం.. కేకలు ఈలలో స్టేడియం హోరెత్తిపోయింది. అంతలోనే రెండో బాల్ ఎదుర్కొన్నాడు ఆ క్రికెటర్. మళ్లీ అదే షాట్. బంతి గాల్లోకి లేచింది. మళ్లీ సిక్స్. బౌలర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. బాల్ వేగం పెరుగుతోంది. ముచ్చటగా మూడో సిక్స్ కొడతాడా లేదా అని అందరోనూ ఆసక్తి మిన్నంటింది. అది కూడా ఫుల్ టాస్ బాల్. మళ్లీ క్రికెటర్ బంతిని గాల్లోకి లేపాడు. మళ్లీ సిక్స్. అదే ఊపుతో ఇంకో రెండు సిక్స్‌లు. ఓవర్లో ఐదు బంతులు అయిపోయాయి. ఇక ఆఖరి బాల్‌కు అందరిలోనూ ఉత్కంఠ. స్టేడియంలో కేరింతలు మార్మోగాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే చరిత్రే. అప్పుడే ఆఖరి బాల్.. గాల్లోకి బంతి.. అందిరి ఉత్కంఠకు తెరితీస్తూ ఆ బంతి ప్రేక్షకుల పోడియంలోకి చొచ్చుకెళ్లింది. అదే యువరాజ్ సింగ్ ఆరు సిక్స్‌ల అద్భుతం.
ఈ ఘనతకు వేదికైంది కింగ్స్మిడ్ స్టేడియం వేదికైంది. సౌత్ ఆఫ్రికాలో 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తలపడ్డాయి. అందులో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో.. యవరాజ్ ఆరు సిక్స్‌లు బాదాడు. 12 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యువరాజ్ ఈ ఘనత సాధించాడు.
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ స్పందించాడు. ట్విట్టర్లో ఓ పోస్ట్ పెడుతూ.."15 సంవత్సరాల తర్వాత ఈ ఘనత చూడడానికి ఇంతకంటే మంచి పార్ట్నర్ దొరకడు" అని తన కుమారుడ్ని ఓళ్లో కూర్చోబెట్టుకుని.. ఆరు సిక్స్‌ల కొట్టిన మ్యాచ్‌ను టీవీలో చూస్తూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. యువరాజ్ ఆరు సిక్స్‌లు కొడుతున్న వీడియోను ఐసీసీ కూడా పోస్ట్ చేసింది. అత్యంత వేగంగా 12 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడని క్యాప్షన్ పెట్టింది.