టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ కుర్ర అభిమాని బౌలింగ్ టాలెంట్‌కు కెప్టెన్ రోహిత్ ఫిదా అయ్యాడు. అతడితో బౌలింగ్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ఫొటో ద్వారా పోస్ట్ చేసింది.
"ప్రాక్టీస్ సెషన్ కోసం ఉదయాన్నే స్టేడియానికి వెళ్లాం. అక్కడ వందల మంది చిన్నారులు ఆట ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. అప్పటికే డ్రెస్సింగ్ రూం నుంచి మేమంతా వారిని గమనిస్తున్నాం. అందులో ఓ బాలుడి బౌలింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయాం. అది అతడికి సహజంగానే అబ్బిందేమో అనేంత అవలీలగా ఆడుతున్నాడు. అందరికన్నా ముందే రోహిత్ అతడిని గమనించాడు. మైదానంలోకి వెళ్లి తనకు బౌలింగ్ వేయాలని అతడిని కోరాడు. వారిద్దరినీ అలా చూడటం చాలా గొప్పగా అనిపించింది. టీమ్ఇండియా కెప్టెన్‌తో ఆడటం ఆ కుర్రాడు ఎప్పటికీ మర్చిపోడు" అని టీమ్ విశ్లేషకుడు హరి ప్రసాద్ మోహన్ వెల్లడించాడు.