తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సెరెనాతో బ్రేక్​ఫాస్ట్ చేయడమంటే ఇష్టం' - టెన్నిస్

అమెరికా స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ సెరెనా విలియమ్స్​తో కలిసి అల్పాహారం తీసుకోవడాన్ని తాను ఇష్టపడతానని చెబుతోంది భారత స్టార్​ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఆమె స్నేహపూరిత మనస్తత్వం తనకు బాగా నచ్చుతుందని వెల్లడించింది.

pv sindhu, indian shatler
పీవీ సింధు, భారత స్టార్ షట్లర్

By

Published : May 26, 2021, 6:32 AM IST

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్​ సెరెనా విలియమ్స్​తో కలిసి అల్పాహారం తీసుకోవటాన్ని తాను ఇష్టపడతానని తెలిపింది.

ప్రసిద్ధి పొందిన అపరిచిత వ్యక్తితో అల్పాహారం తీసుకోవాల్సి వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు సింధు సమాధానం చెప్పింది. "అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్​ సెరెనా విలియమ్స్​​.. ఇతరులతో ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. ఉదయాన్నే ఎలా ఉన్నారని పలకరిస్తుంది. నాకది చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఆమెతో కలిసి అల్పాహారం తీసుకోవాలనుకుంటున్నా" అని సింధు పేర్కొంది.

ఇక ఒలింపిక్స్​కు ముందు తన ప్రాక్టీస్ గురించి వెల్లడించింది సింధు. ఉదయం సమయంలో వార్మప్, మ్యాచ్​ ప్రాక్టీస్​ చేస్తానని వెల్లడించింది. సాయంత్రం వేళల్లో రన్నింగ్, ఫిజికల్ ట్రైనింగ్ చేస్తానని తెలిపింది. "ఉదయాన్నే 6.40కి ఇంటి నుంచి బయలుదేరుతా. 7.00కి వార్మప్ ప్రారంభిస్తా. 7.30కి కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెడుతా. ఇక సాయంత్రం రన్నింగ్, జిమ్, ఫిజికల్ ట్రైనింగ్ వంటివి చేస్తా" అని సింధు పేర్కొంది.

ఇదీ చదవండి:'పొగ తాగనిదే​ వార్న్ మైదానంలోకి దిగడు'

ABOUT THE AUTHOR

...view details