తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2020, 11:19 AM IST

Updated : Oct 22, 2020, 5:29 PM IST

ETV Bharat / sports

వరల్డ్​ జూనియర్​ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు

న్యూజిలాండ్​లో ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచ జూనియర్​ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్స్​ను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది​. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది.

World Junior Badminton Championships 2020 cancelled
'జూనియర్స్​​ బ్యాడ్మింటన్ 2020 పోటీని రద్దు చేస్తున్నాం'

ప్రపంచ జూనియర్​ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్స్​పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. న్యూజిలాండ్​ ఆక్లాండ్​లో ఈ సంవత్సరం జరగాల్సిన ఈ పోటీల్ని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​​)​ ప్రకటించింది. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ సీజన్​కు ప్రత్యామ్నాయంగా 2024లో న్యూజిలాండ్​లో పోటీలను నిర్వహిచాలన్న ప్రతిపాదనను బ్యాడ్మింటన్​ ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించింది.

"ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్స్​- 2020 పోటీని నిర్వహించకపోవడం మాకు బాధగా ఉంది. కొవిడ్​ నిబంధనల వల్ల జనవరి 2021లో జరిగే ఈ పోటీ నిర్వహణ అసాధ్యంగా మారింది. ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్స్​ కోసం ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్ బ్యాడ్మింటన్​, టోర్నీ నిర్వాహకులు,​ ​భాగస్వామ్య సంస్థలకు, న్యూజిలాండ్​ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. 2024లో న్యూజిలాండ్​లో మళ్లీ పోటీలు నిర్వహించి పురస్కారాన్ని అందిస్తాం"

-- థామస్​ లాండ్​, బీడబ్ల్యూఎఫ్​ సెక్రటరీ జనరల్​

సరైన నిర్ణయమే

జూనియర్​- 2020 పోటీ రద్దుతో బ్యాడ్మింటన్​ ప్రేమికులు నిరుత్సాహానికి లోనవుతారని అన్నారు న్యూజిలాండ్​ బ్యాడ్మింటన్​ చీఫ్​.

"ఈ వార్తతో మేం చాలా బాధపడ్డాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే సరైనది. ప్రపంచ బ్యాడ్మింటన్​ ప్రేమికులంతా ఈ కార్యక్రమానికి హాజరై ఆటగాళ్ల ప్రదర్శనను చూడాలనుకున్నారు. కానీ ఈ నిర్ణయం వాళ్లను కాస్త నిరుత్సాహానికి గురి చేయొచ్చు"

-- జో హిచ్​కాక్​, న్యూజిలాండ్​ బ్యాడ్మింటన్​ ఛీఫ్

2021, 2022, 2023 ఛాంపియన్​షిప్స్​కు ఆతిథ్యమిచ్చే దేశాలను ఇప్పటికే ఎంపిక చేయగా.. 2024లో తిరిగి న్యూజిలాండ్​కే అవకాశం ఇస్తామని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.

ఇదీ చూడండి:నవంబరు 1 నుంచి సాయ్​ కేంద్రాల్లో శిక్షణ షురూ

Last Updated : Oct 22, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details