తొలి సెట్ గెలిచిన జోష్‌తోనే రెండో సెట్లోనూ దూకుడు ప్రదర్శించింది సింధు. ఒకుహురతో జరిగిన మ్యాచ్‌లో రెండో సెట్‌ను 21-7 తేడాతో గెలిచి ఫైనల్లో విజయం సాధించింది. ఫలితంగా మూడోసారి టైటిల్ పోరులో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది సింధు.
ప్రపంచ ఛాంపియన్షిప్: సింధు అదరహో - World Championships final LIVE
18:08 August 25
రెండో సెట్ సింధు కైవసం
18:01 August 25
రెండో సెట్లోనూ తెలుగమ్మాయి హూషారు
తొలి సెట్ గెలిచిన జోష్‌తోనే రెండో సెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది సింధు. తొలి అర్ధభాగంలో 14-4 తేడాతో ముందంజలో కొనసాగుతోంది పీవీ సింధు.
17:51 August 25
రెండో సెట్లోనూ సింధు జోరు...
తొలి సెట్ గెలిచిన సింధు... రెండో సెట్‌ను ఘనంగా ఆరంభించింది. ఒకుహురను పదునైన షాట్లతో బెంబేలెత్తిస్తోంది. రెండో సెట్లోనూ 5-2 తేడాతో ముందంజలో కొనసాగుతోంది పీవీ సింధు.
17:49 August 25
ఏకపక్షంగా తొలిసెట్
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసెట్ కైవసం చేసుకుంది సింధు. మొదటి నుంచి ఆధిక్యం కొనసాగిస్తూ ఏకపక్షంగా గెలిచింది తెలుగమ్మాయి. మొదటి సెట్‌ను 21-7 తేడాతో గెలిచి మంచి శుభారంభం చేసింది.
17:42 August 25
మూడోసారి సర్వీస్ బ్రేక్ చేసిన సింధు
తొలిసెట్లో అద్భుతమైన స్మాష్‌లతో అదరగొడుతోంది సింధు. మూడు సార్లు సర్వీస్ బ్రేక్ చేసిన తెలుగుతేజం... 19-5 తేడాతో ముందంజలో ఉంది.
17:38 August 25
సర్వీస్ బ్రేక్ చేసిన సింధు
ప్రత్యర్థి ఒకుహరపై అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది సింధు. తొలి అర్ధభాగంల ో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 11-2 తేడాతో ముందంజలోకి దూసుకెళ్లింది తెలుగమ్మాయి.
17:35 August 25
శుభారంభం చేసిన సింధు..
తొలి సెట్లో బరిలోకి దిగిన సింధు... టైటిల్ గెలవాలన్న కసితో ఆడుతోంది. జపాన్ క్రీడాకారిణిపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి అర్ధభాగంలో 8-2 తేడాతో నిలిచింది తెలుగమ్మాయి.
17:25 August 25
ప్రారంభమైన ఆట
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి ఒకుహర మధ్య టైటిల్ పోరు ప్రారంభమైంది. ఇద్దరు క్రీడాకారిణులు కోర్టులో అడుగుపెట్టారు.
17:13 August 25
డిఫెండింగ్ ఛాంపియన్లదే డబుల్స్ టైటిల్
సింధు-ఒకుహర ఫైనల్ ముందు జరిగిన మహిళల డబుల్స్ టైటిల్ పోరులో... మళ్లీ డిఫెండింగ్ ఛాంపియన్లే గెలిచారు. ఈ మ్యాచ్‌లో మాయు మత్సుమోటో- నగహర(జపాన్) ద్వయం... మరో జపాన్ జోడీ యుకి ఫుకుషిమా-సయక హిరోటాపై 2-1 తేడాతో విజయం సాధించింది.
పసిడి పోరు అద్భుతం...
తొలి సెట్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ మాయు-నగహర జోడీ 21-11 తేడాతో గెలుచుకుంది. రెండో సెట్లో పుంజుకున్న యుకి-సయక జోడీ 22-20 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఇరుజట్లు తలో సెట్ కైవసం చేసుకున్నాయి. హోరాహోరీగా సాగిన ముడో సెట్‌ను 23-21 తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది మాయు-నగహర జోడీ.
16:37 August 25
పసిడి కోసం పోటాపోటీ
సింధు-ఒకుహర ఫైనల్ ముందు ప్రస్తుతం మహిళల డబుల్స్ టైటిల్ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మాయు మత్సుమోటో- నగహర(జపాన్) ద్వయంతో పోటీపడుతోంది మరో జపాన్ జోడీ యుకి ఫుకుషిమా-సయక హిరోటా.
తొలి సెట్‌ను ఢిఫెండింగ్ ఛాంపియన్ మాయు-నగహర జోడీ 21-11 తేడాతో గెలుచుకుంది. రెండో సెట్లో పుంజుకున్న యుకి-సయక జోడీ 22-20 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఇరుజట్లు తలో సెట్ కైవసం చేసుకున్నాయి. మూడో సెట్ హోరాహోరీగా సాగుతోంది.
16:34 August 25
స్వర్ణమే నా లక్ష్యం: సింధు
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ సింధు 21-7, 21-14 తేడాతో... ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యూ ఫీని వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సింధు స్వర్ణమే తన లక్ష్యమని చెప్పింది.
"ఈ టోర్నీలో ఫైనల్ చేరినందుకు ఆనందంగానే ఉన్నా...ఇంకా సంతృప్తి లేదు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. కచ్చితంగా స్వర్ణం గెలవాలనే తపనతో ఉన్నాను. టైటిల్ పోరు అంత సులభమేమి కాదు. ఒకుహరతో గత కొంతకాలంగా తలపడుతూనే ఉన్నా. మ్యాచ్ రోజూ ఏమైనా జరగొచ్చు. నా ఆటపై దృషి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన చేస్తా ".
- పీవీ సింధు, భారత స్టార్ షట్లర్
16:10 August 25
పసిడి వేటలో జోడీలు...
సింధు-ఒకుహర ఫైనల్ ముందు ప్రస్తుతం మహిళల డబుల్స్ టైటిల్ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మాయు మత్సుమోటో- నగహర(జపాన్) ద్వయంతో పోటీపడుతోంది మరో జపాన్ జోడీ యుకి ఫుకుషిమా-సయక హిరోటా.
తొలి సెట్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ మాయు-నగహర జోడీ 21-11 తేడాతో గెలుచుకుంది.
15:09 August 25
పసిడి కళ నెరవేర్చుకున్న తెలుగమ్మాయి
బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్‌తో సమానమైన ప్రపంచ ఛాంపియన్షిప్ తుది సమరం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో... నేడు ఒకుహర(జపాన్)తో పోటీ పడుతోంది మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ ఈ మ్యాచ్‌కు వేదికైంది.
సింధు ఖాతాలో స్వర్ణమేనా..?
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధూకిది మూడోసారి. ఈ టోర్నీలో ప్రకాశ్ పదుకునే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 2013లో కాంస్యం నెగ్గడం ద్వారా సింధు ఆ నిరీక్షణకు తెరదించింది. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు పతకాలు గెలిచినా స్వర్ణం సాధించకపోవడం తీరని లోటు. చివరి రెండు సీజన్లలోనూ ఫైనల్ చేరినా తుది పోరులో బోల్తా పడి రజతంతో సరిపెట్టుకుంది సింధు.
ఒకుహరపై సింధుదే పైచేయి.
ఇప్పటివరకు ఒకుహరతో జరిగిన మ్యాచ్‌ల్లో 8-7 తేడాతో ఆధిక్యంలో ఉంది సింధు. 2017 ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహర చేతిలోనే ఓడింది. తొలిసారి ఆ ప్రతిష్టాత్మక పోరులో స్వర్ణం గెలుద్దామనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్‌కు నిరాశే మిగిల్చింది జపాన్ క్రీడాకారిణి. మళ్లీ రెండేళ్ల తర్వాత సింధును అడ్డుకోవడానికి సిద్ధమవుతోంది. ఈసారి ఒకుహరను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సింధు.
ఫైనల్ ఫోబియా...
ప్రపంచ స్థాయి వేదికలపై సత్తా చాటే సింధు.. ఫైనల్లో మాత్రం బోల్తా పడుతోంది. కొన్నేళ్లుగా ఎన్నోసార్లు తుదిపోరులో ఓడి నిరాశను మిగిల్చింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు మరోసారి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సింధు భావిస్తోంది.