తెలంగాణ

telangana

ETV Bharat / sports

హీరో విష్ణు విశాల్​తో గుత్తా జ్వాల నిశ్చితార్థం - క్రీడా వార్తలు

తమిళ నటుడు విష్ణు విశాల్​ తన ప్రియురాలు బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు బర్త్​డే సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఎంగేజ్​మెంట్​ రింగ్​తో ప్రపోజ్​ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు.

Vishnu Vishal, Jwala Gutta
విష్ణు విశాల్, జ్వాలా గుత్తా

By

Published : Sep 7, 2020, 3:18 PM IST

బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల పుట్టిన రోజు నేడు. ఈ వేడుకను తన ప్రియుడు, నటుడు విష్ణు విశాల్​తో కలిసి హైదరాబాద్​లో జరుపుకొంది. జ్వాలను ఆశ్చర్యపరిచేందుకు విష్ణు హైదరాబాద్​ వెళ్లి.. ఆమెకు ఎంగేజ్​మెంట్​ రింగ్​తో ప్రపోజ్​ చేశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను, నిశ్చితార్థపు ఉంగరాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.

"హ్యాపీ బర్త్​డే జ్వాల. సరికొత్త ఆరంభం ఇది. మన భవిష్యత్తు కోసం మరింత సానుకూలతతో ముందుకు వెళ్దాం. ఆర్యన్​, ఫ్యామిలీ, ఫ్రెండ్స్​ అందరి ఆశీస్సులు మాకు కావాలి. అర్ధరాత్రి నాకు ఈ ఉంగరాన్ని ఏర్పాటు చేసినందుకు బసంత్ ​జైన్​కు కృతజ్ఞతలు."

-విష్ణు విశాల్​, సినీ నటుడు

రెండేళ్లుగా విష్ణు, జ్వాల ప్రేమలో ఉన్నారు. తరచూ ఈ జంట తమ ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో అభిమానులతో షేర్​ చేసుకుంటుంది. నిశ్చితార్థం అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు.. "జ్వాల పుట్టిన రోజును ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నా. అలా ఆమెను ఆశ్చర్యపరిచేలా ఎంగేజ్​మెంట్​ రింగ్​తో ప్రపోజ్​ చేశా. అదృష్టం కొద్దీ అవును అని చెప్పి నన్నే ఆశ్చర్యపరిచింది." అని పేర్కొన్నాడు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత.. ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.

విష్ణు గతంలో రజనీ నటరాజన్​ను వివాహం చేసుకోగా.. వారికి ఆర్యన్​ అనే అబ్బాయి పుట్టాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకుంది. కాగా గుత్తా జ్వాల.. చేతన్​ ఆనంద్​ను వివాహమాడగా.. 2011లో ఇరువురి మనసులు కలవక విడిపోయారు.

ABOUT THE AUTHOR

...view details