బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే వరుడు, తమిళ నటుడు విష్ణు విశాల్ ఇటీవల స్పష్టం చేశాడు.
షట్లర్ గుత్తా జ్వాల-విష్ణు విశాల్ పెళ్లి త్వరలో - గుత్తా జ్వాల మ్యారేజ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ వివాహం త్వరలో జరగనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు సదరు నటుడు.
"జ్వాల నాకెప్పుడూ మద్దతుగా నిలుస్తూనే ఉంది. ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటుంది. ఆమెకు ధన్యవాదాలు. అతి త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను తెలుగు అల్లుడిని కాబోతున్నా. అందుకు చాలా సంతోషంగా ఉంది" అని ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణు విశాల్ పేర్కొన్నాడు.
కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జోడీ, గతేడాది సెప్టెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు తన సొంతనిర్మాణ సంస్థలో జ్వాల జీవిత కథను సినిమాగా తీస్తానని విశాల్ ప్రకటించాడు.