తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సింధు గెలుపు.. క్రీడారంగంలో గొప్ప మలుపు'

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో జగజ్జేతగా నిలిచిన పీవీ సింధును ప్రశంసించారు టీమిండియా చీఫ్ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్, క్రికెటర్ హనుమ విహారి.

పీవీ సింధు

By

Published : Aug 26, 2019, 4:18 PM IST

Updated : Sep 28, 2019, 8:16 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భారతదేశం తరఫున తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆమెతో పాటు కాంస్యం గెలిచిన సాయిప్రణీత్​కు... టీమిండియా చీఫ్​ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్, బ్యాట్స్​మెన్​ హనుమ విహారి శుభాకాంక్షలు చెప్పారు​.

"భారత క్రీడా రంగంలో సింధు గెలుపు గొప్ప మలుపు. భారతీయులు ఆమెను చూసి గర్వపడాలి. భవిష్యత్తులో దేశానికి ఎన్నో విజయాలు అందిస్తుందని నమ్ముతున్నా" -హనుమ విహారి, టీమిండియా బ్యాట్స్​మెన్

"ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలిచినందుకు శుభాకాంక్షలు. నీ నిబద్ధతకు, పట్టుదలకు, నైపుణ్యానికి ఈ విజయమే నిదర్శనం. దేశమంతా నిన్ను చూసి గర్విస్తుంది. కోచ్​ గోపీచంద్​కు అభినందనలు. "​ -ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా చీఫ్ సెలక్టర్

"ఛాంపియన్​లను ఓడించి అద్భుత ప్రదర్శన చేసింది సింధు. కోచ్​లు గోపీచంద్​, కిమ్ కృషికి అభినందనలు. సాయి ప్రణీత్ కాంస్యం దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు. భవిష్యత్తు ఆటగాళ్లకు వీరి ప్రదర్శన నిజమైన ప్రేరణ" -అజయ్​.కె.సింగానియా, భారత బ్యాడ్మింటన్​ సమాఖ్య జనరల్​ సెక్రటరీ

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సింధుకు ఇది ఐదో పతకం. ఈ టోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన జాంగ్​ నింగ్​ సరసన నిలిచింది తెలుగుతేజం. ఇప్పటికే ఆమె ఖాతాలో రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.

పురుషుల విభాగంలో​ రజతం సొంతం చేసుకున్నాడు సాయి ప్రణీత్. 36 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ సెమీస్​లో అడుగుపెట్టిన భారతీయ ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు.
భారత బ్యాడ్మింటన్​ సమాఖ్య(బాయ్​).. సింధుకు రూ.20లక్షలు, ప్రణీత్​కు రూ.5 లక్షల నజరానా ప్రకటించింది.

Last Updated : Sep 28, 2019, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details