చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందాడు. రెండు ఒలింపిక్ స్వర్ణ పతకాలు (బీజింగ్-2008, లండన్-2012) సాధించాడు. అలాగే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్ రిటైర్మెంట్ - బ్యాడ్మింటన్ వార్తలు
చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో అన్ని మేజర్ టోర్నీలలో టైటిల్ గెలిచిన ఏకైక ఆటగాడు డాన్ కావడం విశేషం.
లిన్ డాన్
బ్యాడ్మింటన్ చరిత్రలో తొమ్మిది మేజర్స్ టైటిల్స్ గెలిచాడు లిన్ డాన్. ఇందులో ప్రపంచకప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, ఆసియన్ గేమ్స్, ఆసియన్ ఛాంపియన్ షిప్స్, ప్రపంచ ఛాంపియన్ షిప్, ఒలింపిక్స్ ఇలా అన్ని మేజర్ టోర్నిల్లో పతకాలు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.