ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షట్లర్లతో పాటు టోక్యో వెళ్లడానికి నలుగురు కోచ్‌లను అనుమతించాలని కోరింది. ఇద్దరు ఫిజియోలను వారితో పాటు ప్రయాణించడానికి అంగీకరించాలని పేర్కొంది.
"అవును, మేము ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ రాశాం. పుల్లెంల గోపిచంద్‌తో సహా నలుగురు కోచ్‌లను షట్లర్లతో పాటు పంపాలని కోరాం. అలాగే ఇద్దరు ఫిజియోలను వారితో పాటు వెళ్లడానికి అంగీకరించాల్సిందిగా అభ్యర్థించాం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని మేమనుకుంటున్నాం."