తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​: 'సెట్ల ఫార్మాట్​ను మార్చే ప్రసక్తే లేదు' - ఆస్ట్రేలియా ఓపెన్​లో ఆగని కరోనా కేసులు

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో మరో మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. పురుషల సింగిల్స్​లో​ ఐదు సెట్ల ఫార్మాట్​ను మూడు సెట్లకు కుదించాలని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు టోర్నీ డైరెక్టర్​ క్రెయిగ్​ టైలీ.

aus
ఆస్ట్రేలియా ఓపెన్

By

Published : Jan 19, 2021, 10:03 AM IST

Updated : Jan 19, 2021, 3:07 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి వైరస్​ సోకింది. దీంతో మొత్తంగా ఈ టోర్నీలో పాజిటివ్​ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికే ఈ వైరస్​ కేసుల వల్ల 72 మంది ఆటగాళ్లు క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. వీరు ప్రాక్టీస్​ కూడా చేసుకోవడానికి అవకాశం లేదు.

మార్చే ప్రసక్తే లేదు..

ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్​లో ఐదు సెట్ల ఫార్మాట్​ను మహిళల సింగిల్స్​లో తరహా మూడు సెట్లకు కుదించాలని డిమాండ్​​ వినిపిస్తోంది. అయితే ఫార్మాట్​లో ఎలాంటి సవరణలు చేయడం కుదరదని తేల్చిచెప్పేశారు టోర్నీ​ ఓపెన్​ డైరెక్టర్​ క్రెయిగ్​ టైలీ.

"పురుషుల విభాగంలో ఐదు సెట్లలో మూడు గెలవాలి, మహిళల విభాగంలో మూడు సెట్లలో రెండు గెలవాలి. ఎప్పటినుంచో దీన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి మార్పు జరగదు."

-క్రెయిగ్​ టైలీ, ఆస్ట్రేలియన్​ ఓపెన్​ డైరెక్టర్​.

కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం వల్ల తామేమీ ఆశ్చర్యపోవడం లేదని అన్నారు క్రెయిగ్​​. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించినట్లు చెప్పారు. టోర్నీ జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్​ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి :ఆస్ట్రేలియన్ ఓపెన్​లో కరోనా కలకలం

Last Updated : Jan 19, 2021, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details