భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు దక్కించుకుంది. ఆదివారం థాయ్లాండ్ ఓపెన్ నెగ్గి రికార్డు సృష్టించిన ఈ ద్వయం తాజా ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచింది.
మను అత్రి - సుమిత్డబుల్స్ జోడీ 25వ స్థానంలో ఉంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. కిదాంబి శ్రీకాంత్ 10, సమీర్ వర్మ 13, సాయి ప్రణీత్ 19, ప్రణయ్ 31, సౌరవ్ వర్మ 44 స్థానాల్లో కొనసాగుతున్నారు. పారుపల్లి కశ్యప్ మూడు స్థానాలు మెరుగు పరుచుకుని 32వ స్థానంలో ఉన్నాడు.