థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారతీయుల హవా కొనసాగుతోంది. మలేసియా క్రీడాకారిణి కిసోనా సెల్వదురయ్ను పీవీ సింధు 35 నిమిషాలలోనే 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. థాయ్‌లాండ్ నాలుగో సీడ్ రచనోక్ లేదా దక్షిణ కొరియా క్రీడాకారిణి హ్యుంగ్ జీ సంగ్‌తో సింధు తలపడనుంది.
అంతకుముందు జరిగిన పురుషుల డబుల్స్‌లో దక్షిణ కొరియా 7వ సీడ్ జోడీ సోల్ గ్యు చోయ్, సెయుంగ్ జె సియో పై భారత డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టీ 21-18, 23-21 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు.
కాగా భారత షట్లర్ వర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు మలేసియా 8వ సీడ్ లీ జీ జియాను ఓడించిన వర్మ.. క్వార్టర్ ఫైనల్స్‌లో డెన్మార్క్ క్రీడాకారుడిని 21-12, 21-9తో సునాయసంగా ఓడించాడు. 40 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో 20 నిమిషాలలోపే ఆటపై వర్మ పట్టు సాధించాడు. సెమీ ఫైనల్లో అడుగు పెట్టాలంటే ప్రపంచ నంబర్ మూడో ఆటగాడు అండర్స్ అంటోన్సెన్ను వర్మ ఓడించాలి.