టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు క్వార్టర్‌ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రస్‌మస్ జెమ్‌కీ (డెన్మార్క్)పై 21-12,21-9 తేడాతో సమీర్ వర్మ విజయం సాధించాడు. కేవలం 39నిమిషాల్లోనే ఈ పోరు ముగియడం విశేషం.
థాయ్ ఓపెన్: క్వార్టర్స్‌కు సమీర్, సాత్విక్-అశ్విని ద్వయం - satwik raj aswini ponnappa sails into quarter-finals
టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు భారత షట్లర్ సమీర్ వర్మ. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ రాజ్ రంకిరెడ్డి-అశ్విని పొన్నప్ప ద్వయం కూడా క్వార్టర్ ఫైన్ల్స్లోకి చేరుకున్నారు.
సాత్విక్
మిక్స్డ్ డబుల్స్‌లో జర్మన్‌కు చెందిన ద్వయం మార్క్ లామ్స్‌ఫస్, ఇసాబెల్ హెట్రిచ్పై 22-20, 14-21,21-16 తేడాతో విజయం సాధించారు భారత జోడి సాత్విక్ రాజ్ రంకిరెడ్డి, అశ్విని పొన్నప్ప. ఫలితంగా ఈ జోడీ కూడా క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
ఇదీ చూడండి : థాయ్ ఓపెన్: ప్రణీత్‌కు కరోనా.. శ్రీకాంత్ ఔట్