తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​ ఓపెన్​లో ముగిసిన భారత్ పోరాటం - థాయ్​ ఓపెన్​ నంచి శ్రీకాంత్​ ఔట్​

భారత స్టార్​ షట్లర్లు సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్.. థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి నిష్క్రమించారు.​ సైనా ఓడిపోగా, శ్రీకాంత్ వాక్ ఓవర్ ఇచ్చాడు. దీంతో టోర్నీలో భారత్​ పోరాటం ముగిసినట్లయింది.

thai open
థాయ్​ ఓపెన్​

By

Published : Jan 14, 2021, 4:57 PM IST

Updated : Jan 14, 2021, 9:42 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత్​కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్​ పోరులో భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ ​ఓడింది. థాయ్​లాండ్​ క్రీడాకారిణి బుసావన్‌ చేతిలో 23-21, 14-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. రెండో రౌండ్​లో అడుగుపెట్టిన​ భారత షట్లర్​ కిదాంబి శ్రీకాంత్.. కాలి పిక్క పట్టేయడం వల్ల మ్యాచ్​ మధ్య నుంచి వైదొలిగి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

అంతకముందు మిక్స్​డ్​ డబుల్స్‌ పురుషుల విభాగం రెండో రౌండ్‌లో ఇండోనేషియా ద్వయం మహ్మద్‌ అహ్‌సన్‌, హెంద్ర సెతివాన్‌తో చేతిలో 21-19,21-,17తేడాతో భారత జోడీ సాత్విక్​సైరాజ్​ రంకిరెడ్డి, చిరాగ్​ శెట్టి ఓటమిపాలయ్యారు.

ఇదీ చూడండి: థాయ్​లాండ్ ఓపెన్: సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఓటమి

Last Updated : Jan 14, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details