తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​ ఓపెన్: సెమీస్​లో సాత్విక్-అశ్విని జోడీ ఓటమి

భారత షట్లర్ల మిక్స్​డ్ డబుల్స్​ జోడీ సాత్విక్-అశ్విన్.. థాయ్​ ఓపెన్​ సెమీస్​లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఇద్దరు క్రీడాకారులు మాత్రమే టోర్నీలో మిగిలున్నారు.

Thailand Open: Mixed doubles pair of Satwiksairaj, Ashwini lose in semi-final
థాయ్​ ఓపెన్: సెమీస్​లో సాత్విక్-అశ్విని జోడీ ఓటమి

By

Published : Jan 23, 2021, 7:13 PM IST

టొయొటో థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత్​ పోరాటం ముగిసింది. మిక్స్​డ్ డబుల్స్​ జోడీ సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప సెమీస్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

శనివారం దాదాపు గంటపాటు సాగిన ఈ మ్యాచ్​లో థాయ్​లాండ్​కు చెందిన పువరనుక్రో-సప్సిరీ ద్వయం చేతిలో 22-20, 18-21, 21-12 తేడాతో ఓడింది.

ప్రస్తుతం మన దేశం నుంచి రాంకీ రెడ్డి, పొన్నప్ప మాత్రమే టోర్నీలో మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అంతకు ముందు జరిగిన పోటీల్లో అందరూ ఓటమి పాలయ్యారు.

ఇది చదవండి:విన్నింగ్​ షాట్​తో విరిగిన రాకెట్

ABOUT THE AUTHOR

...view details