కరోనా పరీక్షల విషయంలో థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు భరోసా కల్పించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) రంగంలోకి దిగింది. టోర్నీ నిర్వాహకులతో ఈ విషయమై కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపింది. వైరస్ నిర్ధరణ పరీక్షలను మరింత సురక్షితంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మంగళవారం(జనవరి 12) ప్రారంభమైన థాయ్ ఓపెన్‌లో తనకు చేసిన కరోనా పరీక్షలో అక్కడి వైద్యుల నిర్లక్ష్యంగా ప్రవర్తించారని, దీని వల్ల తన ముక్కులో గాయమై రక్తం వచ్చిందని భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే టెస్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.
శ్రీకాంత్‌కు ముక్కులో నుంచి రక్తం రావడానికి గల కారణాన్ని బీడబ్ల్యూఎఫ్ వివరించింది. "శ్రీకాంత్‌కు కరోనాకు సంబంధించిన స్వాబ్ పరీక్షలు చాలా సార్లు చేయడం వల్ల ముక్కు నుంచి రక్తం కారింది. చివరిసారి చేసిన టెస్టుకు ముందే అతడికి మూడు సార్లు పరీక్షలు నిర్వహించారు. దీంతో అతడి ముక్కులో ఉండే చిన్న రక్త నాళాలు దెబ్బతిన్నాయి. ముక్కులో సన్నని పొడవైన పుల్ల సరిగ్గా పెట్టకపోవడం వల్లే ఇలా జరిగింది. అందుకే నాలుగోసారి చేసిన పరీక్షల్లో గాయమై స్వల్ప మోతాదులో రక్తం కారింది" అని బీడబ్ల్యూఎఫ్ వివరణ ఇచ్చింది.
కశ్యప్ నిష్క్రమణ