థాయ్‌లాండ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన కరోలినా మారిన్(స్పెయిన్).. టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో 21-9, 21-16తో తైవాన్‌కు చెందిన టాప్ సీడ్ షట్లర్ తై జు ఇంగ్‌ను ఓడించింది. తొలి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు మారిన్.
ఫైనల్‌కు అలా..
తొలి రౌండ్లో షీషుఫేయిపై, రెండో రౌండ్లో చోచువాంగ్‌పై, క్వార్టర్ ఫైనల్స్‌లో కేట్తాంగ్పై, సెమీ ఫైనల్స్ ఆన్సే యంగ్‌పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది మారిన్.
పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్.. 21-14, 21-14 తేడాతో హాంగ్‌కాంగ్ షట్లర్ ఆంగస్ లాంగ్‌పై గెలిచాడు.