తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయిలాండ్​ మాస్టర్స్​లో ముగిసిన భారత్​ పోరు - sameer varma

థాయిలాండ్​ వేదికగా జరుగుతున్న బాడ్మింటన్​ మాస్టర్స్​లో.. భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. తొలి రౌండ్​ దాటకుండానే మహిళల సింగిల్స్​లో సైనా నెహ్వాల్​, పురుషుల విభాగంలో నలుగురు స్టార్​ ఆటగాళ్లు ఇంటిముఖం పట్టారు.

Thailand Masters: India's challenge ends on opening day after Saina Nehwal crashes out
థాయిలాండ్​ మాస్టర్స్​లో ముగిసిన భారత్​ పోరు

By

Published : Jan 22, 2020, 7:53 PM IST

Updated : Feb 18, 2020, 12:51 AM IST

బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ 'థాయిలాండ్​ మాస్టర్స్​-2020'లో భారత్​ కథ ముగిసింది. మెగా టోర్నీలో అడుగుపెట్టిన స్టార్​ షట్లర్లంతా తొలి రౌండ్​లోనే ఓడిపోయారు.

సైనా మరో ఓటమి...
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్​ తొలి​ రౌండ్​లో సైనా నెహ్వాల్​ పరాజయం పాలైంది. 47 నిమిషాల పాటు సాగిన ఆటలో 13-21, 21-17, 15-21 తేడాతో డెన్మార్క్​ క్రీడాకారిణి లైన్​ కార్స్​​ఫెల్డ్​పై పోరాడి ఓడింది. తొలి సెట్​లో ఓడిపోయిన తెలుగమ్మాయి.. రెండో సెట్​లో గట్టి పోటీనిచ్చి సెట్​ గెలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్​లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా ఈ ఏడాది మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది సైనా.

ఇదే రోజున భారత పురుషుల షట్లర్లు​ సమీర్​ వర్మ, కిదాంబి శ్రీకాంత్​, ప్రణయ్​ టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్​లోనే అందరూ ఓటమిపాలయ్యారు.

ఇదీ చూడండి.. కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్​లోనే నిష్క్రమణ

Last Updated : Feb 18, 2020, 12:51 AM IST

ABOUT THE AUTHOR

...view details