తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొరియా మాస్టర్స్: రెండో రౌండ్లోకి శ్రీకాంత్, సమీర్

గ్వాంగ్జు వేదికగా జరుగుతోన్న కొరియా మాస్టర్స్​లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ.. రెండో రౌండ్​కు చేరుకున్నారు. మరో క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. కొరియాకు చెందిన కిమ్​పై ఓడి ఇంటిముఖం పట్టాడు.

కొరియా ఓపెన్ రెండో రౌండ్లో శ్రీకాంత్, సమీర్.. సౌరభ్ ఔట్

By

Published : Nov 20, 2019, 11:02 AM IST

ఇటీవలే జరిగిన ఫ్రెంచ్, చైనా, హాంకాంగ్ ఓపెన్​ల్లో విఫలమైన భారత షట్లర్లు.. కొరియా మాస్టర్స్​​లో మెరిశారు. గ్వాంగ్జు వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ.. రెండో రౌండ్​కు చేరుకున్నారు.

శ్రీకాంత్..హాంకాంగ్​కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్​పై 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన తెలుగు తేజం.. మ్యాచ్​ సొంతం చేసుకున్నాడు. వీరిద్దరూ 14 సార్లు ముఖాముఖి తలపడితే 11 సార్లు శ్రీకాంత్​దే విజయం. తర్వాతి మ్యాచ్​లో జపాన్ షట్లర్ కాంటా సునేయామాతో తలపడనున్నాడు.

గాయంతోప్రత్యర్థిఔట్

మరో షట్లర్ సమీర్ వర్మ.. జపాన్ ప్లేయర్ ఖాజుమాసా సాకాయ్​పై​ పైచేయి సాధించాడు. గాయం కారణంగా ప్రత్యర్థి.. మ్యాచ్​ మధ్యలోనే రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరగడం వల్ల తర్వాతి రౌండ్​కు అర్హత సాధించాడు సమీర్.

సౌరభ్ వర్మ ఇంటిముఖం..

పురుషుల సింగిల్స్​లో సమీర్, శ్రీకాంత్ తర్వాతి రౌండ్​కు చేరుకోగా.. సౌరభ్ వర్మ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. లోకల్ ఫెవరెట్ కిమ్ డోంఘన్​ చేతిలో 21-13, 12-21, 12-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.

ఇదీ చదవండి: శృంగార తార సన్నీ లియోనీ... సాకర్ ఆడింది

ABOUT THE AUTHOR

...view details