తెలంగాణ

telangana

ETV Bharat / sports

జపాన్​ ఓపెన్ నుంచి కిదాంబి శ్రీకాంత్​ ఔట్ - పీవీ సింధు

భారత్ బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.. జపాన్​ ఓపెన్​ తొలి రౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు. మరో భారత ఆటగాడు సమీరవర్మ, డెన్మార్క్ క్రీడాకారుని చేతిలో ఓటమి పాలయ్యాడు.

జపాన్​ ఓపెన్​లో శ్రీకాంత్​ కథ ముగిసే

By

Published : Jul 24, 2019, 12:51 PM IST

జపాన్​ ఓపెన్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఫామ్​లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిదాంబి శ్రీకాంత్.. బుధవారం జరిగిన మ్యాచ్​లో మరో భారత షట్లర్​ హెచ్​ఎస్ ప్రణయ్ చేతిలో తొలి రౌండ్​లోనే ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడిన ప్రణయ్, గేమ్​ను 59 నిమిషాల్లోనే ముగించి 21-13, 11-21, 22-20 పాయింట్ల తేడాతో గెల్చుకున్నాడు.

మాజీ ప్రపంచ నంబర్​ వన్ ఆటగాడైన శ్రీకాంత్.. ఈ సీజన్​లో ఫామ్​ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. గత వారం ఇండోనేసియా ఓపెన్​లోనూ రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.

మరో అన్​సీడెడ్ ఆటగాడు సమీర్ వర్మ, డెన్మార్క్​కు చెందిన ఆండ్రెస్ ఆంటోసెన్​ చేతిలో 17-21, 12-21 పాయింట్ల తేడాతో గేమ్​ను చేజార్చుకున్నాడు.
మిక్స్​డ్ డబుల్స్​లో ప్రణవ్-సిక్కి రెడ్డి జోడీ, చైనాకు చెందిన జెండ్​ సీ వై- హుయాంగ్ యా క్వియాంగ్ చేతిలో 11-21, 14-21 తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇది చదవండి: 'హిమ' పాంచ్​ పటాకా- నెలలో 5 స్వర్ణాలు

ABOUT THE AUTHOR

...view details