తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆఖరి మెట్టుపై బోల్తా- శ్రీకాంత్​కు మళ్లీ నిరాశే - srikanth

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ ఇండియా ఓపెన్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్​గా నిలిచాడు.

శ్రీకాంత్

By

Published : Apr 1, 2019, 7:34 AM IST

ఇండియా ఓపెన్ టైటిల్ గెలవాలన్న శ్రీకాంత్​కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన ఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ విక్టర్ అక్సెల్​సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయంపాలై రన్నరప్​తో సరిపెట్టుకున్నాడు.

మొదటి సెట్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన శ్రీకాంత్ రెండో సెట్లో బలమైన పోటీ ఇచ్చాడు. కానీ రెండు గేమ్ పాయింట్స్​ను కోల్పోవడం ద్వారా మ్యాచ్​ను 7-21, 20-22 తేడాతో చేజార్చుకున్నాడు.

శ్రీకాంత్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచి ఏడాది దాటింది. చివరగా 2017లో టైటిల్ గెలిచాడు.

ఇవీ చూడండి..'అత్యంత పిన్న వయసులో ఐపీఎల్​ అరంగ్రేటం'

ABOUT THE AUTHOR

...view details