భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. హాంకాంగ్ ఓపెన్‌లో సెమీస్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్స్‌లో చైనా ప్లేయర్ చెన్ లాంగ్ గాయం కారణంతో టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ఫలితంగా తెలుగు షట్లర్ సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు.
వీరిద్దరి మధ్య జరిగిన తొలి సెట్లో శ్రీకాంతే గెలిచాడు. 21-13 తేడాతో విజయం సాధించాడు. అయితే చెంగ్ ఆట మధ్యలో ఆడలేనని చెప్పి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు(ఈ టోర్నీతో కలిపి) 8 సార్లు తలపడగా.. ఆరు సార్లు చైనా షట్లరే నెగ్గాడు. అతడిపై శ్రీకాంత్ చివరగా 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించాడు.