తెలంగాణ

telangana

ETV Bharat / sports

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ టోర్నీ రెండో రౌండ్లో శ్రీకాంత్ - Srikanth Syed Modi International

లక్నో వేదికగా జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ తొలి రౌండ్​లో శ్రీకాంత్.. రష్యాకు చెందిన వ్లాదిమిర్ మాల్కోవ్​పై నెగ్గాడు. తర్వాతి రౌండ్లో పారుపల్లి కశ్యప్​తో తలపడనున్నాడు.

Srikanth advances to 2nd round of Syed Modi International
శ్రీకాంత్

By

Published : Nov 27, 2019, 6:08 PM IST

అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టి.. బ్యాడ్మింటన్ ప్రీమియర్​ లీగ్​కు దూరమైన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రష్యాకు చెందిన వ్లాదిమిర్ మాల్కొవ్​పై నెగ్గి తర్వాతి రౌండుకు చేరుకున్నాడు.

పురుషుల సింగిల్స్​ విభాగంలో 21-12, 21-11 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు శ్రీకాంత్. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించాడు. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించి గెమ్ సొంతం చేసుకున్నాడు. తర్వాతి రౌండ్లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్​తో తలపడనున్నాడు శ్రీకాంత్.

మహిళల సింగిల్స్​లో అస్మితా చాలిహా శుభారంభం చేసింది. భారత్​కే చెందిన వృశాలీ గుమ్మడిపై 21-16, 21-16 తేడాతో నెగ్గి.. 32 నిమిషాల్లోనే మ్యాచ్​ ముగించింది.

ఇదీ చదవండి: గవర్నర్​గా అవతారమెత్తనున్న శ్రీలంక క్రికెట్ లెజెండ్​..!

ABOUT THE AUTHOR

...view details