కరోనాపై పోరాటంలో క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం వల్ల మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా వర్చువల్ హెల్త్‌కేర్ , హైజీన్ ఎక్స్పో-2020 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సింధు క్రీడల ప్రాముఖ్యాన్ని తెలియజేసింది.
"కరోనాకు ప్రస్తుతం మెడిసిన్ అందుబాటులో లేని కారణంగా మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం. క్రీడలు, ఇతర శారీరక శ్రమ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పొందవచ్చు. 300 నిమిషాల పాటు ఏరోబిక్ పనులు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుత విరామ సమయంలో కసరత్తులు చేయమని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నా. క్రీడాకారిణిగా చెప్పాలంటే రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం ముఖ్యమని భావిస్తా".