తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​ ఓపెన్:​ సౌరభ్ విజేత..మహిళా జోడి రన్నరప్ - భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మ

హైదరాబాద్​ వేదికగా జరిగిన హైదరాబాద్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ విజేతగా నిలిచాడు భారత షట్లర్ సౌరభ్ వర్మ. మహిళా డబుల్స్ విభాగం​లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడి తుదిపోరులో ఓడి రన్నరప్​గా నిలిచారు.

హైదరాబాద్​ ఓపెన్​ గెలిచిన షట్లర్ సౌరభ్ వర్మ

By

Published : Aug 11, 2019, 5:59 PM IST

Updated : Sep 26, 2019, 4:17 PM IST

హైదరాబాద్​ ఓపెన్​లో భారత్​కు ఆదివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్​ విభాగంలో సత్తా చాటిన సౌరభ్ వర్మ.. విజేతగా నిలిచి, మరో సూపర్​-100 టైటిల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం 52 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింగపూర్​కు చెందిన లోహ్ కియాన్ యూపై 21-13, 14-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.

మొదటి రౌండ్​లో 6-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సౌరభ్.. 11-4తో అదే ఊపు కొనసాగించి తొలి గేమ్​ సాధించాడు. రెండో రౌండ్​​లో ఇద్దరూ క్రీడాకారులు నువ్వా నేనా అంటూ ఆడారు. చివరికి విజయం ప్రత్యర్థినే వరించింది. నిర్ణయాత్మక మూడో రౌండ్​లో దూకుడుగా ఆడిన వర్మ..ఆ గేమ్​ను సొంతం చేసుకున్నాడు.

గత సంవత్సరం డచ్ ఓపెన్, రష్యన్ ఓపెన్‌ సూపర్ 100 టైటిల్స్ గెలుచుకున్నాడు సౌరభ్ వర్మ. ఈ ఏడాది మేలో జరిగిన స్లోవేనియన్ ఇంటర్నేషనల్​లో విజేతగా గెలిచాడు.

మహిళా డబుల్స్​లో టాప్ సీడ్ భారత జోడి అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి.. ఈ విభాగంలో తొలి టైటిల్ కొట్టే అవకాశం కొద్దిలో కోల్పోయారు.​ కొరియన్ ద్వయం బేక్ హ నా- జుంగ్ క్యూంగ్ యన్ చేతిలో 17-21,17-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇది చదవండి: 'రెండోసారి మోకాలి శస్త్రచికిత్స కష్టమైన విషయం' అని చెప్పిన క్రికెటర్ సురేశ్ రైనా

Last Updated : Sep 26, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details