తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సయ్యద్ మోదీ' ఫైనల్లో సౌరభ్ వర్మ ఓటమి - సౌరభ్ వర్మ సయ్యద్ మోదీ టోర్నీ

లక్నోలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత షట్లర్​ సౌరభ్ వర్మ ఓటమిపాలయ్యాడు. వాంగ్​ జు చేతిలో 15-21, 17-21 తేడాతో పరాజయం చెందాడు.

సౌరభ్ వర్మ
'సయ్యద్ మోదీ' ఫైనల్లో సౌరభ్ వర్మ ఓటమి

By

Published : Dec 1, 2019, 5:54 PM IST

భారత స్టార్ షట్లర్ సౌరభ్ వర్మ.. సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీ ఫైనల్లో ఓడిపోయాడు. లక్నో వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్​ తుదిపోరు​లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జు చేతిలో 15-21,17-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.

48 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థి షాట్లను కొంతవరకు నిలువరించినా.. సౌరభ్ గెలవలేకపోయాడు. ఇప్పటికే ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ సూపర్​ 100 టైటిల్స్(హైదరాబాద్, వియత్నాం) గెల్చుకున్నాడు సౌరభ్.

ఇది చదవండి: వియత్నాం ఓపెన్​ విజేతగా సౌరభ్​ వర్మ

ABOUT THE AUTHOR

...view details