తెలంగాణ

telangana

ETV Bharat / sports

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఫైనల్లో సౌరభ్ వర్మ

లఖ్​నవూ వేదికగా జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత షట్లర్ సౌరభ్ వర్మ ఫైనల్ చేరాడు. సెమీస్​లో కొరియా ఆటగాడు క్వాంగ్​పై గెలిచాడు.

Sourabh Verma enters final, Rituparna Das loses in semifinals
సౌరభ్ వర్మ

By

Published : Nov 30, 2019, 11:56 PM IST

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో​ భారత షట్లర్లందరూ నిష్క్రమించిన వేళ.. సౌరభ్ వర్మ ఒక్కడే నిలిచాడు. లఖ్​నవూ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్​లో కొరియాకు చెందిన హీ క్వాంగ్​ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు.

పురుషుల సింగిల్స్​ విభాగంలో 21-17, 16-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు సౌరభ్. అనతంరం రెండో గేమ్​లో కొరియన్ ఆటగాడు విజృంభించాడు. ఫలితంగా ఆ సెట్ కోల్పోయాడు భారత షట్లర్.

నిర్ణయాత్మక మూడో గేమ్​ నువ్వానేనా అన్నట్లు సాగింది. అయితే సౌరభ్ వ్యూహాల ముందు ప్రత్యర్థి లొంగిపోయాడు. ఫలితంగా మ్యాచ్​ను చేజిక్కించుకున్నాడు. తుదిపోరులో తైవాన్ క్రీడాకారుడు వాంగ్ జు వీతో తలపడనున్నాడు సౌరభ్.

మహిళల సింగిల్స్​ విభాగంలో భారత షట్లర్ల ప్రయాణం ముగిసింది. సెమీస్​లో రితుపర్ణ దాస్.. థాయ్​లాండ్ ప్లేయర్ చైవాన్ చేతిలో పరాజయం పాలైంది. 22-24, 15-21 తేడాతో వరుస సెట్లలో ఓడి ఇంటిముఖం పట్టింది.

ఇదీ చదవండి: శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్​

ABOUT THE AUTHOR

...view details