సింగపూర్ ఓపెన్‌లో ఈ రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పీవీ సింధు సెమీస్‌కు చేరగా, మరో క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇంటిముఖం పట్టింది.
సింగపూర్ ఓపెన్: సింధు సెమీస్‌కు..సైనా ఇంటికి - badminton players
సింగపూర్ ఓపెన్‌లో భారత్ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సింధు సెమీస్ చేరుకుంది. మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా... ఒకుహర(జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సింగపూర్ ఓపెన్: సింధు సైమీస్కు..సైనా ఇంటికి
సింధు...చైనాకు చెందిన కాయ్ యాన్యన్పై 21-13, 17-21, 21-14 తేడాతో గెలిచింది.ఈ సీజన్లో సెమీస్ చేరడం సింధుకు ఇది రెండోసారి. గత నెలలో ఇండియన్ ఓపెన్‌లోనూ సెమీస్ చేరుకుందీ షట్లర్. సైనా... జపాన్‌కు చెందిన ఒకుహరా చేతిలో 21-8, 21-13 తేడాతో ఓడిపోయింది. తర్వాతి మ్యాచ్‌లో సింధు తలపడనుంది ఒకుహరాతోనే.