ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) స్టార్ షట్లర్స్ పీవీ సింధు, సాయిప్రణీత్, చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ ఆడబోయే ఓపెనింగ్ మ్యాచ్ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్‌గా బరిలో దిగనున్న సింధు.. జులై 25న పొలికర్పొవా(ఇజ్రాయెల్)తో తొలి మ్యాచ్ ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్.. జులై 24న మిషా జిల్బర్మన్(ఇజ్రాయెల్)ను ఎదుర్కొనున్నాడు. సింగిల్స్ విభాగంలో ప్రతిబృందంలోని అగ్రస్థానంలో నిలిచిన ప్లేయర్.. నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు.
Olympics: సింధు, ప్రణీత్ ఓపెనింగ్ మ్యాచ్ వీరితోనే - olympics PV Sindhu
ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) స్టార్ షట్లర్స్ పీవీ సింధు తొలి మ్యాచ్ ఎవరితో ఆడనుంది తెలిసిపోయింది. ఈమెతో పాటు సాయి ప్రణీత్, డబుల్స్ క్రీడాకారుల మ్యాచ్‌ల వివరాలను నిర్వహకులు ప్రకటించారు.
సింధు, ప్రణీత్
పరుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్.. తమ ఓపెనింగ్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో చైనా ద్వయం లీ యంగ్, వాంగ్ చి లిన్‌తో తలపడనున్నారు.
ఇదీ చూడండి: Olympics: సింధు, ప్రణీత్‌కు సులువైన డ్రా