తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింగపూర్​ ఓపెన్​లో సింధు కథ ముగిసె.. - ఒకుహరా

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సింగపూర్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. సెమీస్​లో ఒకుహరా చేతిలో ఓడిపోయింది.

సింగపూర్ ఓపెన్ సెమీస్​లో ఓడిన పీవీ సింధు

By

Published : Apr 13, 2019, 3:48 PM IST

సింగపూర్ ఓపెన్​లో భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవి సింధు కథ ముగిసింది. సెమీస్​లో జపాన్​కు చెందిన ఒకుహరా చేతిలో ఓడిపోయింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే 7-21,11-21 తేడాతో మ్యాచ్​ను చేజార్చుకుంది.

సింగపూర్ ఓపెన్​లో ఒకుహరాతో తలపడిన గత రెండుసార్లు సింధునే గెలిచింది. కానీ ఈసారి సింధుకి ఓటమి తప్పలేదు. అనవసర తప్పిదాలు చేసిన సింధు... మ్యాచ్​ను ఏకాగ్రతతో ఆడలేకపోయింది. ప్రత్యర్థి ఒకుహరా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, గేమ్​ను తన వశం చేసుకుంది. ఫైనల్​ మ్యాచ్​లో ప్రపంచ నంబరు వన్​ తైజుంగ్​తో తలపడనుంది.

మరో సెమీస్​లో యమగూచిపై 15-21,24-22,21-19 తేడాతో గెలిచిన తైజుంగ్​ గెలిచి, తుదిపోరుకు అర్హత సాధించింది.

  • సింధు-ఒకుహరా మధ్య జరిగిన 2017 ప్రపంచ ఛాంపియన్​షిప్ ఫైనల్​ పోరు ఇప్పటికీ రికార్డే. 110 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్​లో విజయం ఒకుహరానే వరించింది.

ఇది చదవండి: ఈ ఏటి మేటి ఆటగాళ్లు... నీరజ్ చోప్రా, సింధు

ABOUT THE AUTHOR

...view details