తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండోనేసియా ఓపెన్​లో భారత షట్లర్ల శుభారంభం

జకార్తాలో జరుగుతున్న ఇండోనేసియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, శ్రీకాంత్ రెండో రౌండ్​కు చేరుకున్నారు.

శ్రీకాంత్ - సింధు

By

Published : Jul 17, 2019, 12:35 PM IST

ఇండోనేసియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్​ టూర్ సూపర్ - 1000 టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ సత్తాచాటారు. తొలి రౌండ్​లో జపాన్​కు చెందిన ఒహోరిపై నెగ్గింది సింధు. అదే దేశానికి చెందిన నిషిమోటోపై గెలిచి రెండో రౌండ్​కు చేరుకున్నాడు శ్రీకాంత్.

5వ సీడ్ సింధు.. ఈ సీజన్​లో తొలి టైటిల్​పై కన్నేసింది. తొలి రౌండ్​లో 11-21, 21-15, 21-15 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్లో ఓడిన సింధు తర్వాత పుంజుకుంది. ఈ ఏడాది ఆరు టోర్నీలు ఆడిన సింధు ఒక్కదాంట్లోనూ ఫైనల్​ వరకు వెళ్లలేకపోయింది.

21-14, 21-13 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించాడు శ్రీకాంత్. కేవలం 38 నిమిషాల్లోనే గేమ్​ను ముగించాడు. ఈ ఏడాది ఇండియా ఓపెన్​లో రన్నరప్​గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్.. ఇండోనేసియా ఓపెన్​ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.

మియా బ్లిచ్​ఫెల్డ్(డెన్మార్క్)-వాంగ్ వింగ్​(హాంకాంగ్​) మధ్య జరిగే మ్యాచ్​లో గెలిచిన వారి​తో తర్వాతి రౌండ్​లో తలపడనుంది సింధు. బ్రైస్(ఫ్రాన్స్​) - లాంగ్ అంగస్​(హాంకాంగ్​) మ్యాచ్​లో గెలిచిన వారితో తర్వాత మ్యాచ్​ ఆడనున్నాడు శ్రీకాంత్.

ఇది చదవండి: ట్వీట్​ రేస్​లో విన్నర్ 'భారత్ - పాక్​ మ్యాచ్'

ABOUT THE AUTHOR

...view details