తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​ టూర్​ ఫైనల్స్​.. సింధు, శ్రీకాంత్ రాణిస్తారా?

బుధవారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్​ ఫైనల్స్ (డబ్ల్యూటీఎఫ్) టోర్నీ ఆరంభమవుతోంది. థాయ్​లాండ్​ ఓపెన్​ రెండు టోర్నమెంట్లలో నిరాశపరచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్​ ఈ టోర్నీకి అర్హత సాధించారు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకానున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Sindhu, Srikanth look to turn the tide at BWF World Tour Finals
నేటి నుంచి వరల్డ్​ టూర్​ ఫైనల్స్​.. సింధు, శ్రీకాంత్ రాణిస్తారా?

By

Published : Jan 27, 2021, 5:20 AM IST

నేటి నుంచే బ్యాంకాక్​ వేదికగా... బీడబ్ల్యూఎఫ్​ (ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య) వరల్డ్​ టూర్ ఫైనల్స్ ప్రారంభంకానుంది. ఆదివారంతో ముగిసిన రెండు థాయ్​లాండ్​ ఓపెన్​లలో నిరాశ పరచినప్పటికీ.. భారత స్టార్​ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నమెంట్​కు అర్హత సాధించారు. అయితే ఈ టోర్నీలో అయినా తిరిగి పుంజుకొని తమ సత్తా చాటాలని వీరు ఆశిస్తున్నారు.

ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్స్​ పతాక విజేత సింధు.. 2018లో డబ్ల్యూటీఎఫ్​ టైటిల్​ను గెలిచుకుంది. అయితే ఈసారి ఆమెకు తీవ్ర పోటీ తప్పేలా లేదు. ప్రస్తుత టోర్నీలో గ్రూప్​ బీలో ఉన్న సింధు.. టాప్​ ర్యాంకర్లు తైజు ఇంగ్, రచనోక్​ ఇంటనాన్, చోచువాంగ్​లో తలపడనుంది.

సుదీర్ఘ విరామం తర్వాత యోనెక్స్​ థాయ్​లాండ్​ ఓపెన్​తో కోర్టులోకి అడుగుపెట్టిన సింధు.. తొలి రౌండ్​లోనే నిష్క్రమించి అందరినీ నిరాశపరించింది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌ చేతిలో పరాజయం పాలైంది సింధు. ఇక టొయొటా థాయ్​లాండ్ ఓపెన్​ క్వార్టర్​ ఫైనల్​లో మలేషియాకు చెందిన రచనోక్ ఇంటనాన్​ చేతిలో వరస సెట్లలో ఓడి నిరాశ పరచింది.

ఇక పురుషుల సింగిల్స్​లో అగ్రగామి షట్లర్లు అండర్స్​ ఆంటోన్సెన్, వాంగ్​జు, లాంగ్​ ఆంగస్​లతో గ్రూప్​ బీలో ఉన్నాడు శ్రీకాంత్. గతంలో ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న శ్రీకాంత్​కు ఈ ఏడాది కలిసి రాలేదు. గాయం కారణంగా యోనెక్స్​ థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి నిష్క్రమించిన అతడు, టొయొటా థాయ్​లాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్​కు కరోనా సోకడం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది.

వరల్డ్​ టూర్ ఫైనల్స్​లో ఈ ఇద్దరికీ తమ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

ఈ నెల 31వరకు ఈ టోర్నీ జరగనుంది.

ఇదీ చూడండి: బ్యాడ్మింటన్​​: టాప్​-10లో ఆరుగురు మనోళ్లే

ABOUT THE AUTHOR

...view details