తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింగపూర్​ ఓపెన్​లో సైనా, సింధు హవా.. - saina

సింగపూర్ ఓపెన్​లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ రెండో రౌండ్​లోకి అడుగుపెట్టారు. ఇండోనేసియాకు చెందిన లియానీ అలెజాండ్రాను సింధు ఓడించగా.. ఆ దేశానికే చెందిన యూలియా సుసాంటోను మట్టికరిపించింది సైనా.

సైనా- సింధు

By

Published : Apr 10, 2019, 12:47 PM IST

సింగపూర్ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో భారత షట్లర్లు సత్తా చాటారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ రెండో రౌండ్​లోకి అడుగుపెట్టారు. తొలిగేమ్​లో ఇండోనేసియాకు చెందిన లియానీ అలెజాండ్రాను ఓడించింది సింధు. కేవలం 27 నిమిషాల్లోనే 21-9, 21-7 తేడాతో మట్టికరిపించింది. తర్వాత మ్యాచ్​లో డెన్మార్క్​కు చెందిన మియాతో తలపడనుంది సింధు.

మరో భారత అగ్రశ్రేణి షట్లర్​ సైనా నెహ్వాల్ ఇండోనేసియాకు చెందిన యూలియా యోసెఫిన్​ సుసాంటోను ఓడించింది. 21-16, 21-7 తేడాతో అలవోకగా గెలుపొందింది సైనా. ముగ్ధా ఆగ్రే-చోచువాంగ్​ మ్యాచ్​లో గెలిచినవారితో తదుపరి రౌండ్ ఆడనుంది.

పురుషుల డబుల్స్​లో భారత షట్లర్లు తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మను అత్రి- సుమిత్ రెడ్డి జోడీ సింగపూర్​కి చెందిన డ్యానీ-కీన్ చేతిలో 13-21, 17-21 తేడాతో ఓడిపోయింది. మిక్స్​డ్​ డబుల్స్​లోనూ సౌరభ్ శర్మ- అనౌష్క జోడీ 12-21, 12-21 తేడాతో థాయ్ ద్వయం డేచ్​పూల్​- సాప్స్రీ చేతిలో పరాజయం పాలైంది.

ABOUT THE AUTHOR

...view details