తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండోనేసియా ఓపెన్ నుంచి సింధు ఔట్.. ముగిసిన భారత్ పోరు - Sindhu suffered defeat at the hands of Japans Sayaka Takahashia

ఇండోనేసియా మాస్టర్స్​ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. జపాన్​కు చెందిన సయాక టకహషియా చేతిలో పరాజయం చెందింది.

Sindhu
సింధు

By

Published : Jan 16, 2020, 6:52 PM IST

Updated : Jan 16, 2020, 7:01 PM IST

జకర్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేసియా మాస్టర్‌ సూపర్‌ - 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటానికి తెరపడింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్​కు చెందిన సయాక టకహషియా చేతిలో ఓటమిపాలైంది.

సయాక చేతిలో 21-16, 16-21, 19-21 తేడాతో ఓడి ఇంటిముఖం పట్టింది సింధు. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ పోరాటంలో మొదటి సెట్లో ఆధిపత్యం వహించిన సింధు.. మిగిలిన రెండు సెట్లలో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇదే క్రీడాకారిణి రెండో రౌండ్​లో సైనాను కూడా ఓడించింది.

సింధు ఓటమితో ఇండోనేసియా ఓపెన్​లో భారత్ పోరు ముగిసింది. ఇండియా పురుష షట్లర్లు సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మ బుధవారం జరిగిన రెండో రౌండ్​లోనే ఓటమి పాలయ్యారు.

గత వారం జరిగిన మలేసియా ఓపెన్​లోనూ భారత షట్లర్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో పురుషు షట్లర్లు రెండో రౌండ్ దాటడానికే కష్టపడగా.. సింధు, సైనా క్వార్టర్​ ఫైనల్​ వరకు వెళ్లారు. గతేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్​ తర్వాత సింధు ఒక్క పతకం తేలేకపోయింది.

ఇవీ చూడండి.. టీమిండియా తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది: అక్తర్

Last Updated : Jan 16, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details