బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత్‌కు నిరాశ ఎదురైంది. అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ షట్లర్ పీవీ సింధు...తొలి రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 16-21తో ఓటమి పాలైన సింధు, రెండో సెట్‌ను 22-20తో గెలుచుకుంది. చివరి సెట్లో 17-21 తేడాతో ఓడిపోయి ఛాంపియన్షిప్ నుంచి నిష్క్రమించింది.
గత ఏడాది హాంకాంగ్ ఓపెన్‌లోనూ సుంగ్ చేతిలోనే ఓడింది సింధు. ఇది సింధుకు వరుసగా రెండో ఓటమి. మొత్తంగా 15 సార్లు ఈ షట్లర్లు ఢీకొనగా.. తెలుగు తేజం ఎనిమిదింట్లో పైచేయి సాధించగా.. ఏడింట్లో సుంగ్ గెలిచింది.