తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ టూర్ ఫైనల్స్​ తొలి మ్యాచ్​లోనే సింధు పరాజయం - ప్రపంచ టూర్​ ఫైనల్స్​ సింధు

'బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌'లో భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు.. ఆరంభ మ్యాచ్​లోనే వెనుదిరిగింది. అకానే యమగూచి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది.

sindhu lost in first match in the bwf world tour finals
ప్రపంచ టూర్ ఫైనల్స్​లో తొలి మ్యాచ్​లో ఓడిన సింధు

By

Published : Dec 12, 2019, 9:27 AM IST

Updated : Dec 12, 2019, 9:38 AM IST

ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్​షిప్స్ మినహా మిగతా టోర్నీల్లో పెద్దగా ఆక్టటుకోని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వైఫల్యాన్ని కొనసాగించింది. 'బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌'లో మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో డిఫెండింగ్​ ఛాంపియన్​గా బరిలోకి దిగిన సింధు.. యమగూచి చేతిలో ఓడింది.

68 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-18, 18-21, 8-21తో చేజేతులా ఓడిపోయింది సింధు. తొలి గేమ్‌ నెగ్గి.. రెండో గేమ్‌లో 15-11తో ఆధిక్యం సంపాదించిన ఈ షట్లర్.. విజయం సాధించడం లాంఛనమే అనిపించింది. ఐతే వరుసగా 5 పాయింట్లతో యమగూచి రేసులోకి వచ్చింది. సింధు పుంజుకున్నా పట్టువదలని యమగూచి.. వరుసగా 5 పాయింట్లు నెగ్గి 21-18తో రెండో గేమ్‌ గెల్చుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పూర్తిగా తేలిపోయింది.

గురువారం చెన్‌ యుఫీ (చైనా)తో సింధు తలపడుతుంది.

ఇదీ చదవండి: కెప్టెన్సీ నుంచి రషీద్ ​ఖాన్ ఔట్​... అఫ్గాన్​కు బాధ్యతలు

Last Updated : Dec 12, 2019, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details