తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండోనేసియా​ ఓపెన్​ ఫైనల్లో సింధు - Indonesia Open BWF Tour Super 1000 tournament

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్​ టైటిల్​కు అడుగు దూరంలో నిలిచింది. అగ్రశ్రేణి​ క్రీడాకారిణులను ఓడించి ఫైనల్​ చేరింది. చైనా ప్లేయర్ చెన్‌ యూఫీతో శనివారం జరిగిన పోరులో 21-19, 21-10 తేడాతో విజయం సాధించింది.

ఇండోనేసియా​ ఓపెన్​ ఫైనల్లో సింధు

By

Published : Jul 20, 2019, 6:35 PM IST

భారత స్టార్​ బ్యాడ్మింటన్​​ పీవీ సింధు మరో అద్భుత విజయం సొంతం చేసుకొనేందుకు ఓ మెట్టు దూరంలో ఉంది. ఇండోనేషియా ఓపెన్​ బీడబ్ల్యూఎఫ్​ టూర్ సూపర్​-1000 టోర్నీలో ఫైనల్​ చేరి పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్​లో మూడో సీడ్ చైనా క్రీడాకారిణి చెన్‌ యూఫీపై 21-19, 21-10 తేడాతో గెలిచింది ఐదో సీడ్​ సింధు.

చెన్​పై విజయం సాధించిన తెలుగుతేజం

తిరుగులేని స్మాష్​లు..

మొదటి రౌండ్​లో 4-7 తేడాతో వెనుకబడిన సింధు... వరుసగా ఐదు పాయింట్లు గెలుచుకొని ముందంజలో నిలిచింది. చైనా క్రీడాకారిణి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఎత్తును ప్రధానంగా ఉపయోగించుకున్న సింధు ప్రత్యర్థికి అవకాశం లేని షాట్లతో చెలరేగింది. హోరాహోరీగా సాగిన పోరులో 21-19 తేడాతో తొలి సెట్​ గెలుచుకొంది.

రెండో సెట్​లో పూర్తిగా చేతులెత్తేసింది చైనీస్ ప్లేయర్​. తొలి నుంచే ఆధిక్యంలో నిలిచిన సింధు 16-8తో నిలిచి.. చివరికి 21-10 తేడాతో విజయం సాధించి రెండో సెట్​ను ముగించింది​.

సింధు, చెన్‌ యూఫీ

ఫైనల్​లో యమగూచితో..

ఈ ఏడాది​ సింగపూర్​ ఓపెన్​, ఇండియా ఓపెన్​లో సెమీఫైనల్​ చేరినా ఒక్క టైటిల్​ గెలవలేకపోయిన సింధు... ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్​లో అడుగుపెట్టింది.​ టోర్నీ ఆద్యంతం తనకన్నా బలమైన ప్రత్యర్థులపై వరుసగా విజయాలు సాధించింది.

అకానే యమగూచి

జపాన్​ క్రీడాకారిణీ​ యమగూచి.. శనివారం జరిగిన మ్యాచ్​లో ప్రపంచ నెంబర్​ వన్ తైజు యింగ్​ను 21-9, 21-15 తేడాతో ఓడించింది. సింధుతో టైటిల్​ పోరుకు సిద్ధమవుతోంది. ఆదివారం ఫైనల్​​​ మ్యాచ్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details