తెలంగాణ

telangana

By

Published : Sep 17, 2019, 5:16 AM IST

Updated : Sep 30, 2019, 10:05 PM IST

ETV Bharat / sports

చైనా ఓపెన్​: పతకమే లక్ష్యంగా బరిలోకి సింధు

మంగళవారం నుంచి మొదలయ్యే చైనా ఓపెన్​లో పతకం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నారు భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్. టైటిల్​ సాధించడంపై ఇరు షట్లర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

పీవీ సింధు

ఇటీవలే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచి... ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా అవతరించింది పీవీ సింధు. ఇప్పుడు మరో పతకం దక్కించుకుని సీజన్​ ముగించాలని చూస్తోంది. మంగళవారం ప్రారంభమయ్యే చైనా ఓపెన్​లో సత్తా చాటాలని ఆశిస్తోంది.

మరో పతకంపై కన్నేసిన సింధు

తన తొలి మ్యాచ్​లో చైనాకు చెందిన లీ యురైతో తలపడనుంది సింధు. ప్రస్తుతం 20వ ర్యాంకులో ఉన్న లీకి.. సింధుపై 3-3 రికార్డు ఉంది. ఈ ఏడాది ఇప్పటికే ఇండోనేషియా మాస్టర్స్​లో ఈ క్రీడాకారిణిని ఓడించిన సింధుకు ఈ మ్యాచ్​ కష్టం కాకపోవచ్చు. ఇందులో ఆమె గెలిస్తే, అనంతరం మిచెల్లీ లీతో ఆడనుంది. అన్ని మ్యాచ్​లు సవ్యంగా సాగి, సింధు విజయాలు సాధిస్తే క్వార్టర్స్​లో మూడో సీడ్​ ప్లేయర్ చెన్ యూఫీతో పోటీ పడొచ్చు.

సైనా ఈ సారైనా కొట్టేనా..!

ప్రపంచ 8వ ర్యాంకర్​ సైనా నెహ్వాల్.. గాయాల నుంచి కోలుకుని ఈ టోర్నీకి సిద్ధమైంది. ఈ సీజన్​లో ఇప్పటికే ఇండోనేషియా మాస్టర్స్​ టైటిల్ నెగ్గిన ఈ షట్లర్​... ఇందులోనూ రాణించాలని చూస్తోంది. తొలి రౌండ్​లో థాయ్​లాండ్​కు చెందిన బుసనన్​తో తలపడనుంది సైనా. మాజీ ప్రపంచ ఛాంపియన్ తైజు యింగ్​తో క్వార్టర్స్​లో పోటీ పడనుంది.

స్టార్ షట్లర్లు పునరాగమనం

వరల్డ్​ టూర్​ సీజన్​లో చైనా ఓపెన్​ చివరి సూపర్ 1000 ఈవెంట్. గాయాల నుంచి కోలుకున్న ప్రముఖ షట్లర్లు కరోలినా మారిన్, విక్టర్ ఆలెక్సన్ ఈ టోర్నీతో తిరిగి కోర్టులో అడుగుపెట్టనున్నారు.

గాయాల కారణంగా భారత ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్.. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. అందరి కళ్లు సాయి ప్రణీత్​పైనే ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో 36 ఏళ్ల తర్వాత పతకం సాధించాడు. ఇప్పుడు చైనా ఓపెన్​లోనూ రాణించాలని చూస్తున్నాడు.

ఇది చదవండి: పద్మభూషణ్​కు సింధు.. పద్మవిభూషణ్​కు మేరీకోమ్

Last Updated : Sep 30, 2019, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details