ఇండోనేషియా మాస్టర్స్ (Indonesia Masters 2021) సూపర్ 750లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV sindhu news)పోరాటం ముగిసింది. అద్భుత విజయాలతో సెమీ ఫైనల్‌కు చేరుకున్న సింధు.. తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. సెమీస్‌లో జపాన్ షట్లర్ అకానే యమగూచి చేతిలో వరుస సెట్లలో ఓడి ఇంటిముఖం పట్టింది.
ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లో సింధు ఓటమి - సెమీస్‌లో పీవీ సింధు ఓఠమి
ఇండోనేషియా మాస్టర్స్ (Indonesia Masters 2021) సూపర్ 750లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV sindhu news)కథ ముగిసింది. సెమీఫైనల్లో యమగూచి చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.
సింధు
ఈ పోరులో మొదటి నుంచి సింధుపై పూర్తి ఆధిపత్యం వహించిన యమగూచి 13-21, 9-21 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందు యమగూచిపై 12-7 తేడాతో సింధునే ఫేవరెట్‌గా కనిపించింది. కానీ సెమీస్‌లో అద్భుతంగా పోరాడిన జపాన్ ప్లేయర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.